మాస్ కాదు.. హర్రర్ కాదు.. ఫ్యామిలీ ఎంటెర్టైనరే!!

నాగ చైతన్య ఒకప్పుడు మాస్ అభిమానుల కోసం మాస్ మాస్ అంటూ ఎగబడి.. కెరీర్ ని గాడితప్పేలా చేసుకున్నాడు. తరవాత మెల్లిగా లవ్ స్టోరీస్ చేసినప్పటికీ.. మధ్యలో [more]

Update: 2020-06-09 06:33 GMT

నాగ చైతన్య ఒకప్పుడు మాస్ అభిమానుల కోసం మాస్ మాస్ అంటూ ఎగబడి.. కెరీర్ ని గాడితప్పేలా చేసుకున్నాడు. తరవాత మెల్లిగా లవ్ స్టోరీస్ చేసినప్పటికీ.. మధ్యలో మాస్ ని మాత్రం వదల్లేదు. సమంత తో పెళ్ళికి ముందు నాగ చైతన్య వరస అపజయాలతో ఉన్నాడు. తర్వాత మళ్ళీ మజిలీలో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాగ చైతన్య శేఖర్ ఖమ్ములతో లవ్ స్టోరీ చేసాడు. అయితే తాజాగా మనం తో అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ చైతు తో సినిమాకి రెడీ అవుతున్నాడు. అయితే విక్రమ్ కుమార్ నాగ చైతన్యతో చెయ్యబోయే సినిమా గతంలో విక్రమ్ కుమార్ కి హిట్ ఇచ్చిన 13B కి సీక్వెల్ అంటూ ప్రచారం జరగడంతో దర్శకుడు సినిమా గురించి తాజాగా స్పందించాడు.

నాగ చైతన్య తో చేయబోయేది ఏ హర్రర్ జోనరో. లేదా మాస్ జోనరో కాదు.. 13B సీక్వెల్ అసలే కాదు.. ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నా అని… అందులో క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది అని చెప్పడంతో.. చైతూకి కలిసొచ్చిన లవ్ స్టోరీ నే మళ్ళీ చేయబోతున్నాడని అక్కినేని భిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు.మరి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నాగ చైతన్యు ఎవరితో రొమాన్స్ పండించబోతున్నాడో చూడాలి. ఇక చైతు సంగతి ఒకే.. ఇటు విక్రమ్ కుమార్ హలొ యావరేజ్, గ్యాంగ్ లీడర్ ప్లాప్ తో చైతూతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

Tags:    

Similar News