విశ్వక్ సేన్ vs అర్జున్ రెడ్డి ఫ్యాన్స్

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే బూతు డైలాగ్స్, రొమాంటిక్ అండ్ లిప్ లాక్స్ [more]

Update: 2019-06-03 05:25 GMT

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే బూతు డైలాగ్స్, రొమాంటిక్ అండ్ లిప్ లాక్స్ తో విజయ్ దేవరకొండ కి భారీగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అప్పటినుండి విజయ్ కి ఎదురు లేకుండా పోయింది. ఆ సినిమా తర్వాత చాలామంది హీరోలు తమ తమ సినిమాల్లో బూతులు మట్లాడుతూ రొమాంటిక్ గా రెచ్చిపోయినా… పెద్దగా వారు ఫోకస్ కాలేకపోయారు కానీ.. తాజాగా ఫలక్ నుమదాస్ హీరో విశ్వక్ సేన్ మాత్రం వార్తల్లో నిలిచాడు. మందు మగువ, బూతు అంటూ ఫలక్ నుమదాస్ తో బాగా ఫెమస్ అయిన విశ్వక్ సేన్ ఇప్పుడు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా ఊహించుకుంటున్నట్లుగా కనబడుతుంది ఆ హీరో వ్యవహారం.

విశ్వక్ సేన్ తన సినిమా తోపు అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాడు. ఫలక్ నుమా దాస్ సినిమాకి ప్రమోషన్స్ కారణంగా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ పడ్డాయి. కానీ సినిమాలో బూతులు, మందు లాంటి వి తప్ప స్పెషల్ గా ఏం లేకపోయేసరికి సినిమా కలెక్షన్స్ తగ్గాయి. అయితే విశ్వక్ సేన్ మాత్రం తన సినిమా సూపర్ అంటూ… ప్రమోట్ చేసుకుంటూ కాస్త ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇప్పుడు విశ్వక్ సేన్ ఫలక్ నుమదాస్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఫలక్ నుమదాస్ సినిమా పరమ చెత్తగా ఉందని విజయ్ ఫ్యాన్స్ ఫలక్ నుమా దాస్ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ చేసే పనికి తన సినిమా కలెక్షన్స్ తగ్గుతాయన్న విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వలన తన సినిమా ఫలక్ నుమదాస్ సినిమా కి డ్యామేజ్ జరిగితే మీ అంతు చూస్తానంటూ.. విజయ్ ఫాన్స్ కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు విశ్వక్ సేన్.

Tags:    

Similar News