ఎఫ్ 2 హవా ఇంకా ఆగలేదు..!

ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ఎఫ్ 2 చిత్రం ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. వరుణ్ – వెంకీ కామెడీ టైమింగ్ తో ఈ [more]

Update: 2019-03-19 10:11 GMT

ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ఎఫ్ 2 చిత్రం ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. వరుణ్ – వెంకీ కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించి భారీ లాభాలను దక్కించుకున్నాడు. ఈ సినిమా రచ్చ ఇంకా యూట్యూబ్ లో మాత్రం ఆగలేదు. ఫైనల్ ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని కామెడీ సీన్స్ అంటూ దిల్ రాజు అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేస్తున్నారు.

కోటి వ్యూస్ తో…

డిలీటెడ్ కామెడీ సీన్స్ అంటూ వీడియో బిట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి ఈ వీడియోలు. నిమిషానికి అటుఇటుగా ఉండే ఈ వీడియోస్ ఇప్పటికే ఐదు విడుదల చేసారు. వాటన్నింటికి కలిపి దాదాపుగా 10 మిలియన్ వ్యూస్ అంటే కోటి వ్యూస్ దక్కాయి. దీనిని బట్టి ఈ సినిమాను ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆదరిస్తున్నారో అర్థం అవుతోంది.

Tags:    

Similar News