ఎఫ్ 2 జోరు తట్టుకోవడం కష్టమే..!

ఈ నెలలో విడుదలైన సినిమాలన్నీ వరసగా ఫ్లాప్ కావడంతో… ఒకే ఒక్క సినిమా తన జోరు ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ ఏడాది భారీ [more]

Update: 2019-01-28 08:35 GMT

ఈ నెలలో విడుదలైన సినిమాలన్నీ వరసగా ఫ్లాప్ కావడంతో… ఒకే ఒక్క సినిమా తన జోరు ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి – దిల్ రాజుల ఎఫ్ 2 సినిమా జోరు ఇప్పట్లో ఆగేలా కనబడడం లేదు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన చిత్రాల్లో ఎఫ్ 2 మాత్రమే జోరు చూపిస్తుంది. విడుదలైన మొదటి షోకే హిట్, పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సినిమాలో సెకండ్ హాఫ్ వీక్ అన్నారు. నిజంగానే ఎఫ్ 2 ఫస్ట్ హాఫ్ కామెడీతో అదరగొట్టేయ్యగా.. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగానే కాస్త ఫ్రస్టేషన్ కి గురి చేసింది. కానీ థియేటర్స్ లో మంచి సినిమా లేకపోవడంతో ఎఫ్ 2 విజయంతో విర్రవీగుతుంది.

నైజాంలో రికార్డు కలెక్షన్స్

గత రెండు వారాలుగా ఎదురులేని ఎఫ్ 2 సినిమాకి అఖిల్ మిస్టర్ మజ్ను, బాలీవుడ్ మూవీ మణికర్ణిక సినిమాలు అడ్డు తగులుతాయేమో అని అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల హడావిడి కనిపించకపోయే సరికి ఎఫ్ 2 మళ్ళీ తన జోరు మూడో వారంలోనూ కంటిన్యూ చేస్తోంది. కేవలం భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం 75 కోట్ల షేర్ అందుకుంటున్న ఈ రోజుల్లో ఎఫ్ 2 ఆ ఫిగర్ ని సునాయాసంగా దాటేసింది. 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఎఫ్ 2 ఇపుడు 16 రోజులు తిరిగే సరికి 71 కోట్ల షేర్ ని తెచ్చిపెట్టింది. మరి వరల్డ్ వైడ్ గా 71 కోట్ల షేర్ తెచ్చింది. నైజాంలో పెద్ద పెద్ద చిత్రాలకు మాత్రమే సాద్యమేయ్యే 20 కోట్ల ఫిగర్ ని ఎఫ్ 2 మూడు వారాలు తిరగక ముందే క్రాస్ చెయ్యడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. నైజాంలోనే కాదు ఓవర్సీస్ లోనూ ఎఫ్ 2 జోరు మాములుగా లేదు. అందుకే ఈ నెలలో విడుదలైన సినిమాలన్నీ ఎఫ్ 2 కే వంగి సలాం కొడుతున్నాయి.

Tags:    

Similar News