హిట్ వచ్చినా లాభం లేదా..!

ఈ సంక్రాంతికి మల్టీస్టారర్ గా పెద్దగా ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా. అనిల్ [more]

Update: 2019-01-21 10:26 GMT

ఈ సంక్రాంతికి మల్టీస్టారర్ గా పెద్దగా ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా. అనిల్ రావిపూడి పూర్తి కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కించిన ఈ సినిమాతో దిల్ రాజు చాలా రోజుల తర్వాత తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ లు నటించారు. ఈ సినిమా సంక్రాతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సినిమా హిట్ లో మేజర్ క్రెడిట్ వెంకటేష్ కి దక్కితే.. తర్వాత దిల్ రాజు కి, అనిల్ రావిపూడి సమానమైన క్రెడిట్స్ దక్కాయి. కానీ హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ లు ఈ హిట్ సినిమాలో భాగమైనా పెద్దగా పట్టించుకున్నోళ్లు కనబడడం లేదు.

ఇద్దరిదీ అదే పరిస్థితి

ఈ సినిమాలో గ్లామర్ షో చేసిన ఈ భామలిద్దరూ… ఎఫ్ 2 హిట్ తో మంచి అవకాశాలు వస్తాయనుకుంటే…. ఎఫ్ 2 హిట్ ఈ హాట్ భామలకు ఉపయోగం లేకుండా పోయింది. భర్తను ఫ్రస్ట్రేట్ చేసే భార్యగా తమన్నా… కట్టుకోబోయే వాడిని కాల్చుకుతినే అమ్మాయిగా మెహ్రీన్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రమోషన్స్ లోనూ ఎక్కువగా కనిపించిన ఈ భామలకు ఫలితం శూన్యంలా కనబడుతుంది. మరి ఇప్పటికే ఫేడవుట్ లిస్టులో ఉన్న తమన్నాకి సీనియర్ హీరోలెవరైనా ఛాన్స్ లిస్తారో లేదో చూడాలి. ఇక చాలా సినిమాల ఫ్లాప్ తో ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకున్న మెహ్రీన్ కి ఈ ఎఫ్ 2 హిట్ ఎంత మేర మేలు చేకూరుస్తుందో చూడాలి…!

Tags:    

Similar News