ఎఫ్ 2 అమెరికా లో 1.5 మిల్లియన్ వసూల్ చేసింది

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సినిమా ‘ఎఫ్ 2’ . వరుణ్ తేజ్ – వెంకటేష్ [more]

Update: 2019-01-20 07:47 GMT

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సినిమా ‘ఎఫ్ 2’ . వరుణ్ తేజ్ – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈసినిమా ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసాడు. తొలిరోజు నుండే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈసినిమా ఈ ఏడాది లో మొదటి బ్లాక్ బ్లాస్టర్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో నే కాదు ఓవర్సీస్ లోను ఈమూవీ జోరు కొనసాగిస్తుంది. ముఖ్యంగా యూఎస్ఏ బాక్సాఫిస్ వద్ద సత్తా చాటుతుంది. ఇప్పటివరకు ఈసినిమా అక్కడ 1.5 మిల్లియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా చాలా ఏరియాస్ లో ప్రాఫిట్స్ ను తెచ్చిపెడుతుంది.

వెంకీ అండ్ వరుణ్ కెరీర్ లో హైయెస్ట్ కల్లెక్షన్స్ సాధించిన చిత్రంగా ఎఫ్ 2 రికార్డు నెలకొల్పింది. ఈసినిమాను నిర్మించిన దిల్ రాజు కు సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి వర్క్ అవుట్ అయ్యింది. ఇదే ఊపుతో త్వరలోనే ఎఫ్ 3 కూడా స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అనిల్ రావిపూడి కి ఈసినిమాతో వరసగా నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి

Tags:    

Similar News