ఎఫ్ 2కి మళ్లీ కలిసొచ్చింది..!

గత నెలలో సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో స్టార్ హీరోల సినిమాలను మట్టి కరిపించిన ఎఫ్ 2 సినిమాకి అన్నీ కలిసొస్తున్నాయి. ఇప్పటికీ [more]

Update: 2019-02-16 06:51 GMT

గత నెలలో సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో స్టార్ హీరోల సినిమాలను మట్టి కరిపించిన ఎఫ్ 2 సినిమాకి అన్నీ కలిసొస్తున్నాయి. ఇప్పటికీ ఎఫ్ 2 ఆడుతున్న థియేటర్స్ లో ప్రేక్షకులు నిండుగా కనిపిస్తున్నారంటే… ఈ నెల రోజులుగా పోటీ ఇచ్చే సినిమా ఏది ఎఫ్ 2కి తగలేకపోవడమే కారణం. కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాలను పక్కకు నెట్టి మరీ ఎఫ్ 2 ఒక రేంజ్ లో కలెక్షన్స్ కోల్లగొట్టి 100 కోట్ల క్లబ్బులో చేరిందని.. ఆ సినిమా నిర్మాత దిల్ రాజే స్వయంగా ప్రకటించాడు. ఇక సంక్రాతి సినిమాలను పక్కనబెడితే.. జనవరి మూడో వారంలో ఎలాంటి సినిమా లేకపోవడం తో ఎఫ్ 2 కలెక్షన్స్ పెరగడానికి కారణమయ్యింది. మరోపక్క అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను కూడా జనవరి చివరి వారంలో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. ఎఫ్ 2 మళ్లీ రెచ్చిపోయింది.

యాత్ర బాగున్నా…

ఇక ఫిబ్రవరి 1న కూడా ఎలాంటి సినిమా బాక్సాఫీసు దగ్గరకు రాలేదు. ఇక అప్పటికి ఎఫ్ 2 థియేటర్స్ లో ఫుల్ అవుతూనే ఉంది. గత వారం యాత్ర సినిమా బాగున్నప్పటికీ… సినిమాకి కొంతమంది ప్రేక్షకుల సపోర్ట్ మాత్రమే దొరకడంతో ఎఫ్ 2 హావా కొనసాగింది. ఇక ఎఫ్ 2 విడుదలైన నెలరోజులకు డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్ వారు ఆన్ లైన్ లో రిలీజ్ చేసేసారు. ఇక అమెజాన్ లో ఎఫ్ 2 రిలీజ్ అయినప్పటికీ.. ఎఫ్ 2 థియేటర్స్ లో మాత్రం ప్రేక్షకుల హావా కొనసాగింది.

ఈ వారం కూడా…

నిన్నగాక మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవ్, లవర్స్ డే సినిమా టాక్ మళ్లీ ఎఫ్ 2కి కలిసొచ్చేలా చేసింది. కార్తీ – రకుల్ హిట్ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యలేక చేతులెత్తేస్తే… ప్రియా క్రేజ్ తోనే సినిమా ఆడదని లవర్స్ డే సినిమా ప్రూవ్ చేసింది. అలా ఈ వారానికి కూడా ప్రేక్షకుడికి ఏకైక ఆప్షన్ ఎఫ్ 2నే కనబడుతుంది. మరి అందరికీ ఆమెజాన్ ప్రైమ్ అందుబాటులో ఉండదుగా.. అందుకే కొంతమంది థియేటర్స్ కి వెళ్లక తప్పదు. అది కూడా ఎఫ్ 2 ని వీక్షించేందుకు. మరి ఎఫ్ 2కి అలా కలిసొచ్చేసింది అంతే.

Tags:    

Similar News