రానాని..కావాలని ఇరికించారా

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు మేనల్లుడు నాగ చైతన్య కోసం రంగంలోకి దిగబోతున్నాడు. ఎఫ్ 2 సినిమా మొత్తం వెంకటేష్ [more]

Update: 2019-01-31 02:54 GMT

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు మేనల్లుడు నాగ చైతన్య కోసం రంగంలోకి దిగబోతున్నాడు. ఎఫ్ 2 సినిమా మొత్తం వెంకటేష్ కామెడీ టైమింగ్ తోనే బంపర్ హిట్ అయ్యింది. వెంకీ ఎఫ్ 2 ని వన్ మ్యాన్ షో మాదిరి అందరిని మెప్పించాడు. సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 ప్రకంపనలు ఇంకా ఆగలేదంటే… ఆ సినిమా ఏ రేంజ్ హిట్టో అర్ధమవుతుంది. ఇక ఇపుడు మేనల్లుడు నాగ చైతన్య తో కలిసి వెంకిమామ సినిమా షూటింగ్ లో వెంకటేష్ పాల్గొనబోతున్నాడు. దర్శకుడు బాబీ డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ, నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ లు నటిస్తున్నారు.

ఈ సినిమాలో వెంకటేష్, నాగ చైతన్యలు ఒరిజినల్ రిలేషన్ షిప్ మామ అల్లుళ్ళు మాదిరిగానే.. సినిమాలోనూ మామ అల్లుళ్లుగా కనబడబోతున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పల్లెటూరి మామయ్యలా కామెడీ తో రెచ్చిపోతాడని.. మొదటినుండి ప్రచారంలో ఉన్న న్యూస్. ఇకపోతే క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ అన్న కొడుకు… అదేనండి మన భల్లాలదేవుడు దగ్గుబాటి రానా కూడా ఈ సినిమా లో ఓ గెస్ట్ పాత్ర చేయబోతున్నట్లుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎప్పటినుండో బాబాయ్ సినిమాలో నటించాలనుందనే కోరికతోనే రానా ఈ సినిమా లో గెస్ట్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

అందుకే దర్శకుడు బాబీ కూడా ఈ సినిమా కథ లో రానా కి కేరెక్టర్ లేకపోయినా.. ఇప్పుడు ప్రత్యేకించి ఒక పాత్ర సృష్టించినట్లుగా చెబుతున్నారు. మరి ఒరిజినల్ కథలో లేని రానా పాత్ర ఇప్పుడు ఇలా కావాలనే ఇరికించారన్నమాట. సో వెంకిమామ లో మనం భళ్లాల దేవుణ్ణి చూడొచ్చన్నమాట. ఇక రానా కి ఒకే సినిమాతో బాబాయ్ తోనూ, బావతోను నటించే ఛాన్స్ దక్కింది. మరి నాగ చైతన్య రానా అత్తా కొడుకేగా… అందుకే బావ తోనూ నటించే ఛాన్స్ రానా కి దక్కిందన్నమాట

Tags:    

Similar News