`ఎఫ్ 2` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Update: 2018-11-05 11:28 GMT

విభిన్న‌ సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్దపీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెంకటేశ్‌... ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ 'ఎఫ్ 2'. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ట్యాగ్ లైన్‌. వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్స్‌ గా న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాను డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. 'ప‌టాస్‌', 'సుప్రీమ్‌', 'రాజా ది గ్రేట్‌' హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్‌ను విడుద‌ల చేశారు.

Similar News