పెద్ద సినిమాలకు దడ పుట్టించింది..!

అనిల్ రావిపూడి తీసిన సినిమాల్ని సూపర్ డూపర్ హిట్స్ కాకపోయినా.. హిట్స్ అయ్యాయి. కానీ తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 మాత్రం బ్లాక్ బస్టర్ [more]

Update: 2019-01-22 07:25 GMT

అనిల్ రావిపూడి తీసిన సినిమాల్ని సూపర్ డూపర్ హిట్స్ కాకపోయినా.. హిట్స్ అయ్యాయి. కానీ తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాలన్నీ ముసుగు తన్నెయ్యడంతో.. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోయింది. ఎఫ్ 2 సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్.. కానీ సెకండ్ హాఫ్ డల్. కానీ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ అంటే సెకండ్ వీక్ లోనూ అదేపనిగా పనిగా ఆదరిస్తున్నారు. సెకండ్ వీకెండ్ లోనూ ఎఫ్ 2 జోరు ఏమాత్రం తగ్గలేదంటేనే ఎఫ్ 2 సినిమా ఎలాంటి బ్లాక్ బస్టరో తెలుస్తుంది. అసలే దిల్ రాజు ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ కూడా చెయ్యలేదు.

బడ్జెట్ కి రెట్టింపు వసూళ్లు…

కేవలం మౌత్ టాక్ తోనే సినిమా థియేటర్స్ లో ఇరగదీస్తోంది. సెకండ్ వీక్ లోనూ ఎఫ్ 2దే హావా అనడానికి… దానికొస్తున్న కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఎఫ్ 2 సినిమాని నిర్మించాడు. మరి 30 కోట్లతో నిర్మిస్తే.. ఇప్పుడు ఆ సినిమా దానికి డబుల్.. డబుల్ ఏంటి..? ఏకంగా 70 కోట్ల షేర్ రాబట్టిందంటూ న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తుంది. సంక్రాతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 తొలి వారంలోనే వరల్డ్ వైడ్ గా 61.43 కోట్లు వసూలు చేసిందని.. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద అయితే 2 మిలియన్ డాలర్లతో దిశగా ఎఫ్ 2 దూసుకెళుతుందని ఆ చిత్రం యూనిట్ చెబుతున్న మాట.

ఆ సినిమాల లోటు తీర్చేసింది

మరి దిల్ రాజుకు గత ఏడాది ఫ్లాప్ అయిన సినిమాల లోటుని ఈ ఎఫ్ 2 తీర్చేసింది. మరి మీడియం సినిమాగా విడుదలైన ఎఫ్ 2 స్టార్ హీరో రేంజ్ కలెక్షన్స్ కొల్లగొడుతూ.. సంక్రాతి బడా సినిమాలకు దడ పుట్టించింది. మరి మాస్, క్లాస్ కన్నా కామెడీకి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అవుతారో అనేది ఈ ఎఫ్ 2 సినిమా చూస్తుంటేనే తెలుస్తుంది.

Tags:    

Similar News