ఎఫ్ 2 వాటిని క్రాస్ చేస్తుందా..?

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఎఫ్ 2 ఒక్కటే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయ్యి మూడు వారాలు [more]

Update: 2019-01-29 07:22 GMT

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఎఫ్ 2 ఒక్కటే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయ్యి మూడు వారాలు కూడా అవ్వకముందే రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. నైజాంలో ఇప్పటికే 20 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన ఈ సినిమా అటు అమెరికాలో రీసెంట్ గా 2 మిలియన్ డాలర్ క్లబ్ చేరి 14వ తెలుగు సినిమాగా నిలిచింది.

టాప్ 10 లిస్ట్ లో చేరేలా…

ట్రేడ్ లెక్కల ప్రకారం మరో రెండు రోజులు ఇదే హావా నడిస్తే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాను.. మరో వీకెండ్ నడిస్తే ఫిదా, అజ్ఞాతవాసిని కూడా క్రాస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వారం ఇలానే నడిస్తే అమెరికాలో టాప్ 10 లిస్ట్ లోకి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని అధికారంగా ప్రకటించారు.

Tags:    

Similar News