వెంకీ ని ఫాలో అవుతున్న నాగ్

‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీ తరువాత అక్కినేని నాగార్జున కి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. గత ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అయితే ఒక్కటి కూడా [more]

Update: 2019-02-04 10:46 GMT

‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీ తరువాత అక్కినేని నాగార్జున కి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. గత ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అయితే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ‘ఆఫీసర్’ డిజాస్టర్ గా నిలిస్తే…దేవదాస్ పర్లేదు అనిపించుకుంది. ఎంత చేసిన సక్సెస్ రాకపోవడంతో నాగ్ తన ప్లాన్ ని మార్చుకున్నాడట.

విక్టరీ వెంకటేష్ ని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈమధ్య వెంకీ తన సినిమాల్లో కామెడీ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటున్నాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా ఎఫ్ 2 చిత్రాల్లో వెంకీ తన కామెడీ టైమింగ్ తో ఎలా ఎంటర్టైన్ చేసాడో వేరే చెప్పనవసరం లేదు. దీన్ని చూసి నాగార్జున కూడా వెంకీ ఫార్ములాని వాడాలని ఫిక్స్ అయ్యాడట.

అందుకే కళ్యాణ్ కృష్ణ తీయబోయే ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ మూవీలో కూడా ఎక్కువ భాగం కామెడీ ఉండేలా చూడమని నాగ్ డైరెక్టర్ చెప్పాడట. చూద్దాం మరి వెంకీలా నాగ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో .

Tags:    

Similar News