స్టేజ్ మీద మాట్లాడరు..బయటికొస్తే మాత్రం

బిగ్ బాస్ లోకి వెళ్లోచ్చిన ప్రతి కంటెస్టెంట్ బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని బిగ్ బాస్ మీద హౌస్ లోని కంటెస్టెంట్స్ మీద నానారకాల [more]

Update: 2020-09-21 06:10 GMT

బిగ్ బాస్ లోకి వెళ్లోచ్చిన ప్రతి కంటెస్టెంట్ బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని బిగ్ బాస్ మీద హౌస్ లోని కంటెస్టెంట్స్ మీద నానారకాల కామెంట్స్ చేస్తారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కానీ…. అదే స్టేజ్ మీద ఎలిమినేట్ అయ్యి నాగ్ మాట్లాడమన్నప్పుడు కానీ.. బిగ్ బాస్ గురించి కంటెస్టెంట్స్ గురించి మాత్రం నెగెటివ్ గా మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడినా ఎడిటింగ్ చేస్తారనుకుంటారో.. హోస్ట్ ముందు బిగ్ బాస్ ని తిట్టడం ఎందుకనుకుంటారో కానీ.. బిగ్ బాస్ ని బిగ్ బాస్ స్టేజ్ మీద పల్లెత్తిమాట అనరు. కానీ స్టేజ్ దిగి జనజీవన స్రవంతిలో కలవగానే బిగ్ బాస్ అలాగా, బిగ్ బాస్ ఇలాగ. మనం చేసేది వేరు, చెప్పేది వేరు.. బిగ్ బాస్ లో చూపించేది వేరు అంటూ రకరకాల కామెంట్స్ బిగ్ బాస్ మీద చేస్తారు.

బిగ్ బాస్ కండిషన్స్ ఒప్పుకునే కదా కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టేది. అన్ని ఒప్పుకున్నాక బిగ్ బాస్ అలా ఇలా అంటే ఎలా అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పుడు బిగ్ బాస్ పై విరుచుకుపడుతున్నారు. వితిక సేరు బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక ఫ్రెండ్స్, బయటివారు మమ్మల్ని శత్రువుల్లా చూడడానికి బిగ్ బాస్ కారణం, బిగ్ బాస్ లో కాంట్రవర్సీలు హైలెట్ అవుతాయి కానీ… ఫ్రెండ్ షిప్ లు హైలెట్ కావు అంటూ మొదలెడితే దానికి శివ జ్యోతి, సీజన్ 3 కంటెస్టెంట్ గీత మాధురి సపోర్ట్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ లోకీ వారిని బలవంతంగా పంపరు. పారితోషకాలకో, క్రేజ్ కోసమో… అందులో పాల్గొంటే సినిమా అవకాశాలు వస్తాయనో… ఏదైనా మీరు మీరుగానే బిగ్ బాస్ కి వెళ్తున్నారు కానీ… ఎవరు బిగ్ బాస్ లోకి బలవంతంగా అయితే తీసుకెళ్లరు. మరి బిగ్ బాస్ కి కావల్సిన స్టఫ్ నే ప్రేక్షకులకు ఇస్తారు. అంతేకాని కంటెస్టెంట్స్ కోరిక మేరకు వాళ్ళు అడిగింది వెయ్యరు కదా. ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయనుకున్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళకూడదు..ఇది మరో నెటిజెన్ మాట.

Tags:    

Similar News