సినిమా కన్నా వెబ్ సీరీస్ బెటరేమో

ఇప్పుడు చాలామంది నటులు సినిమాల్తో పాటుగా వెబ్ సీరీస్ లోను యాక్టీవ్ అవుతున్నారు. టాప్ హీరోయిన్ సమంత లాంటోళ్లే వెబ్ సీరీస్ కి ప్రాధాన్యమిస్తుంటే.. చిన్న నటులు [more]

Update: 2019-09-27 07:36 GMT

ఇప్పుడు చాలామంది నటులు సినిమాల్తో పాటుగా వెబ్ సీరీస్ లోను యాక్టీవ్ అవుతున్నారు. టాప్ హీరోయిన్ సమంత లాంటోళ్లే వెబ్ సీరీస్ కి ప్రాధాన్యమిస్తుంటే.. చిన్న నటులు కూడా వెబ్ సీరీస్ బాట పడుతున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లలో వెబ్ సీరీస్ కి ఎంత పాపులారిటి క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. ఇక వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో హీరోగా మారిన సందీప్ కిషన్ కి ఈ మధ్యన సినిమాలేమి కలిసి రాలేదు. నిన్నగాక మొన్నొచ్చిన నిను వీడని నీడను నేనే సినిమా కి హిట్ టాకొచ్చినా ప్రమోషన్స్ లేక సినిమా ప్లాప్ అయ్యింది. ఇక తాజాగా తెనాలి రామకృష్ణ సినిమా తో సెట్స్ మీదున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వెబ్ సీరీస్ తో అదరగొట్టేస్తున్నాడు.

ఇకపై వెబ్ సిరీసే…..

అమెజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో సందీప్ కిషన్ కమాండో ఆఫీసర్ గా అదరగొట్టేస్తున్నాడు. మనోజ్ బాజ్పాయ్ హీరోగా, ప్రియమణి ముఖ్య పాత్రలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సందీప్ కిషన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సైనికుడిగా అదరగొట్టేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలో పలు బాంబ్ బ్లాస్ట్ లకు ప్లాన్ చేస్తుంటే.. వాటిని తిప్పికొట్టడానికి మనోజ్ బాజ్పాయ్ టీం చేసే ప్రయత్నంలో సందీప్ కిషన్ వారికీ సహాయం చేసే విక్రమ్ వేద్ కమాండో ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేశాడు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ చూశాక చాలామంది సందీప్ కిషన్ ని సినిమాలు కలిసిరావట్లేదు కదా…. వెబ్ సీరీస్ కి దూకేయ్ అంటూ సలహాలిస్తున్నారు.

 

Tags:    

Similar News