నన్ను కూడా అలానే చేసారు.. కానీ నేను..!!

ఇప్పుడు బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య తో బాలీవుడ్ లో నేపోటిజం ఏ రేంజ్ లో రాజ్యమేలుతుందో అనేది చాలామంది సెలబ్రిటీస్ ఒకొక్కరిగా బయటపెడుతున్నారు. [more]

Update: 2020-06-17 10:12 GMT

ఇప్పుడు బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య తో బాలీవుడ్ లో నేపోటిజం ఏ రేంజ్ లో రాజ్యమేలుతుందో అనేది చాలామంది సెలబ్రిటీస్ ఒకొక్కరిగా బయటపెడుతున్నారు. టాప్ స్టార్స్ కూడా బాలీవుడ్ లో సినీ నేపథ్యం లేని వారిని తొక్కేయ్యడం అనేది ఎప్పటినుండో ఉందని తమ ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి ఎంతమంది బాధపడ్డారో.. అంతమంది అతని ఆత్మహత్యకి కారణం బాలీవుడ్ అతన్ని పట్టించుకోకపోవడమే అంటున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది తమకి జరిగిన అవమానాలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ బోల్డ్ సుందరి పాయల్ రాజపుట్ తనకి బాలీవడో లో ఎదురైనా ఓ అవమానాన్ని అభిమనులతో పంచుకుంది. నా మైండ్ లో ఎన్నో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. అవన్నీ మీతో ఎలా పంచుకోవాలో నాకు అర్ధం కావడం లేదు.

ఏది ఏమైనా ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. బాలీవుడ్ లోనే కాదు.. ఏ చిత్ర పరిశ్రమలోనైనా చీకటి కోణం ఉంది. అందులో ముఖ్యంగా నేపోటిజం. బాలీవుడ్ నరనరాల్లో నేపోటిజం పేరుకుపోయింది. ఆ ఆటలో గెలిస్తే అదృష్టం.. ఓడిపోతే దురదృష్టం అనే పేరు పెడతారు. ఇక ఒక్కో మెట్టు ఎక్కుతున్న వారిలో అభద్రతాభావం కలిపిస్తారు. బాలీవుడ్ కూడా నన్ను దూరం పెట్టింది. పాయల్ నువ్వు ఈ పాత్రకి సరిపోవు అంటూ నా ప్లేస్ లో మరొకరిని తీసుకున్నప్పుడు నా గుండె ముక్కలైంది. మానసికంగా నేను కుంగిపోయాను. అంతేకాని ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. మీరు బాధలో ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి జీవించండి. కొంతమంది బాధ ఉన్నా పైకి నవ్వుతూ నటిస్తారు. కానీ బాధ ఉన్నప్పుడు బిగ్గరగా మాట్లాడి, ఏడవండి. అంతేకాని లోపల దాచుకుని కుంగిపోతే ఆత్మహత్య ఆలోచనలే వస్తాయంటుంది పాయల్ రాజపుట్.

Tags:    

Similar News