అద్భుతః అన్న రేంజ్ లో ఉండేలా ఉందే

ఈమధ్యన జబర్దస్త్ రేటింగ్ విషయంలో ఈటివి అన్ని ఛానల్ కామెడీ షో లకి చుక్కలు చూపెట్టే పనిలో ఉంది. జబర్దస్త్ ని తలదన్నే షోలు ఎన్ని వచ్చినా [more]

Update: 2020-03-08 06:29 GMT

ఈమధ్యన జబర్దస్త్ రేటింగ్ విషయంలో ఈటివి అన్ని ఛానల్ కామెడీ షో లకి చుక్కలు చూపెట్టే పనిలో ఉంది. జబర్దస్త్ ని తలదన్నే షోలు ఎన్ని వచ్చినా ఈటీవి జబర్దస్త్ కి ఎదురు లేదనేది అందరికి అర్ధమయింది. ఇక ఈటివి పండగలకు ప్రత్యేకించి ఓ స్పెషల్ ప్రోగ్రాం చేస్తుంది. కమెడియన్స్, యాంకర్స్, జెడ్జెస్, సింగర్స్, డాన్సర్స్ అందరితో కలిసి పండగ స్పెషల్ ప్రోగ్రాం అంటూ ఈటీవీలో ఏ పండగైనా ఉదయం 9 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసారమయ్యేలా ప్లాన్ చేస్తుంది. ఆలాగే ఈ ఉగాది కి కూడా ఈటివి ఓ ఉగాది స్పెషల్ ప్రోగ్రాం గా ‘పండగ సర్.. పండగ అంతే’ అంటూ ఓ ప్రోగ్రాం చెయ్యడం దానికి సంబందించిన ఓ ప్రోమోని వదలడం అది కాస్త యూట్యూబ్ లో ట్రెండ్ అవడం జరిగింది.

ఎప్పటిలాగే రోజా, శేఖర్ మాస్టర్ జడ్జెస్ కమ్ డాన్సర్స్ గా ఈ షోలో అదరగొట్టగా… శ్రీముఖి, సుడిగాలి సుధీర్ యాంకరింగ్ తో ఇరగ దీశారు. మరి జబర్దస్త్ పోరి అనసూయ మాత్రం ఈ ప్రోగ్రాం లో మిస్ అయ్యింది. అనసూయ ఈ ప్రోగ్రాం ప్రోమోలో ఎక్కడా కనబడలేదు అంటే.. అనసూయ లేనట్టే. ఆ లోటు తప్ప.. వర్షిణి, ఆది డాన్స్ పెరఫార్మన్స్, రోజా – శేఖర్ మాస్టర్ డాన్స్ పెరఫార్మెన్స్, ఎప్పటిలాగే కామెడీ స్కిట్స్ తో ‘పండగ సర్.. పండగ అంతే’ ఎస్పెషల్ ప్రోగ్రాం ని డిజైన్ చేసారు. రోజా, శేఖర్ మాస్టర్ అదిరిపోయే క్లాస్ మాస్ డాన్సులు ఈ షో కి స్పెషల్ అట్రాక్షన్స్ అనేలా ఉంది. అలాగే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వరూ ఆఫ్టర్ అంటూ రోజా, శ్రీముఖి, శేఖర్ మాస్టర్ చెప్పిన సరిలేరు నీకెవ్వరూ డైలాగ్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో పండింది.

Tags:    

Similar News