వైల్డ్ ఎంట్రీ ద్వారా తెలుగు హాట్ హీరోయిన్

ప్రస్తుతం బిగ్ బాస్ 3 యమ హాట్ గా జరుగుతుంది. మొదటి వారం హేమ ఎలిమినేట్ అయింది. ఆ తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ట్రాన్స్ [more]

Update: 2019-08-24 10:42 GMT

ప్రస్తుతం బిగ్ బాస్ 3 యమ హాట్ గా జరుగుతుంది. మొదటి వారం హేమ ఎలిమినేట్ అయింది. ఆ తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వచ్చింది. అలా వచ్చిందో లేదో నెగటివ్ ఓట్లు ద్వారా రెండో వారమే వెళ్ళిపోతుంది. ఆమె వ్యవహార శైలి నచ్చక ప్రేక్షకులు ఆమెను ఇంటి నుండి పంపేశారు.

ఇక రీసెంట్ గా రోహిణి వెళ్ళింది. అయితే రేపు మరొకళ్ళు ఎలిమినేట్ కానున్నారు. ఎలిమినేషన్ లో అషు రెడ్డి, మహేష్ విట్టా, బాబా భాస్కర్, రాహుల్, శివ జ్యోతి, హిమజ, పునర్నవి ఉన్నారు. వీరిలో ఒక్కరు రేపు ఎలిమినేట్ కానున్నారు. తాజాగా ఇప్పుడు త్వరలో మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ని ఇంట్లోకి పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఒక తెలుగు హీరోయిన్. ఈ లిస్ట్ లో శ్రద్ధాదాస్, ఈషా రెబ్బ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తెలుగు సెలబ్రిటీని పంపాలని నిర్ణయించుకున్నారట బిగ్ బాస్ నిర్మాతలు. తెలుగు అమ్మాయిగా చెప్పుకునే ఈషా రెబ్బ వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఆమెకు ఛాన్స్ వచ్చి వెళ్తే ఆమె ఇమేజ్ బిగ్ బాస్ షో తరువాత మారుతుందా? లేదో చూడాలి. ప్రస్తుతం ఆమె ఒక సినిమాలో నటిస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News