తెలుగు పిల్ల సినిమా కష్టాలు

తెలుగు హీరోయిన్స్ కి తెలుగులో ఆఫర్స్ ఉండవు కానీ.. పర భాషల్లో వాళ్ళకి రెడ్ కార్పెట్ ఉంటుందనేది ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఇక్కడివాళ్ళు హీరోయిన్స్ గా ఎదగడానికి [more]

Update: 2019-11-25 08:48 GMT

తెలుగు హీరోయిన్స్ కి తెలుగులో ఆఫర్స్ ఉండవు కానీ.. పర భాషల్లో వాళ్ళకి రెడ్ కార్పెట్ ఉంటుందనేది ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఇక్కడివాళ్ళు హీరోయిన్స్ గా ఎదగడానికి పడని కష్టం ఉండదు.. అయినా ఫలితం సూన్యం. తెలుగు హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమైన ఈషా రెబ్బ ఇంకా హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తనే ఉంది. చూడగానే తెలుగందం ఉట్టిపడేలా కనిపించే ఈషా రెబ్బ ఈమధ్యన గ్లామర్ షో అంటూ రకరకాల ఫోటో షూట్స్ తో దర్శకనిర్మాతలు రెచ్చగొడుతోంది. అయినా పని జరగడం లేదు.

తాజాగా రాగల 24 గంటలు సినిమాతో మరో ప్లాప్ అందుకుంది. సస్పెన్సు త్రిల్ల్ర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆ థ్రిల్లింగ్ మిస్ అవడంతో ప్రేక్షకులు ఆ సినిమా కి బై బై చెప్పారు. అటు రివ్యూస్, ఇటు ప్రేక్షకులు కూడా రాగల 24 గంటలకు నెగెటివ్ టాక్ ఇవ్వడంతో… మెయిన్ ఆ సినిమా దెబ్బ ఈషా రెబ్బ మీద పడింది. ఆ సినిమా హిట్ అయితే కాస్త మంచి సినిమాలలో అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎంతగా గ్లామర్ షో చేసినా ఈ తెలుగు పిల్లకి కష్టమే అంటున్నారు.ఇపుడు ఈషా రెబ్బ తెలుగులో ఉంటుందో.. పక్క భాషలో ప్రయత్నిస్తుందో చూద్దాం.

Tags:    

Similar News