గ్లామర్ డోస్ పెంచింది.. ఆఫర్స్ పడుతుంది

తెలుగులో హీరోయిన్స్ కొరతఉంది. అసలు తెలుగమ్మాయిలు.. హీరోయిన్స్ గా పెద్దగా క్రేజ్ సంపాదించలేకపోయారు. చిన్న చితక సినిమాల్తో… కేరెక్టర్ ఆర్టిస్ట్ లుగా, సెకను హీరోయిన్స్ గానే వాళ్ళు [more]

Update: 2019-11-02 10:12 GMT

తెలుగులో హీరోయిన్స్ కొరతఉంది. అసలు తెలుగమ్మాయిలు.. హీరోయిన్స్ గా పెద్దగా క్రేజ్ సంపాదించలేకపోయారు. చిన్న చితక సినిమాల్తో… కేరెక్టర్ ఆర్టిస్ట్ లుగా, సెకను హీరోయిన్స్ గానే వాళ్ళు కాస్త కూస్తో సంపాదిస్తున్నారు. అయితే తెలుగమ్మాయి ఈషా రెబ్బ ట్రెడిషన్ నుండి ఈమధ్యన గ్లామర్ డోస్ బాగా పెంచింది. హీరోయిన్ గా చిన్న చిన్న సినిమాలు చేసే ఈషా రెబ్బ పేద స్టార్స్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గాను నటిస్తుంది. అయితే ఎన్టీఆర్ తో అరవింద సమేతలో నటించిన ఈషా రెబ్బ ఆఖరుకి ఆటలో అరటిపండులా మిగిలిపోయింది.

అయితే తాజాగా రాగాల 24 గంటల్లో హీరోయిన్ గా నటించిన ఈషా ఈమధ్యన గ్లామర్ డోస్ బాగా పెంచిది. ఇక ఆ గ్లామర్ ఫోటో షూట్ తోనే ఇప్పుడో బడా సినిమా ఆఫర్ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. మెగా స్టార్ చిరు – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఈషా రెబ్బ కి ఓ ఛాన్స్ వచ్చిందనే టాక్ నడుస్తుంది. ఇప్పటివరకు హీరోయిన్ గా ఇంకా ఎవరిని ఫైనల్ చెయ్యని కొరటాల ఇప్పుడు ఈషా రెబ్బ ని ఓ కీలక పాత్రకోసం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక మెయిన్ హీరోయిన్ లిస్ట్ లో అనుష్క, నయనతార, శృతి హాసన్ చివరిగా త్రిష పేర్లు వినబడినా.. ఫైనల్ గా చిరు కి హీరోయిన్ ఎవరో ఇంకా సెట్ కాలేదు కానీ ఈషా రెబ్బ కి మాత్రం ఓ పాత్ర ఖాయమంటూ వార్తలొస్తున్నాయి.

Tags:    

Similar News