అరవిందలో ఈషా కి మొండి చెయ్యేనా..?

Update: 2018-10-04 08:21 GMT

ప్రస్తుతం అరవింద పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా పూజ హెగ్డే తో పాటు ఈషా రెబ్బ ఒక పాత్రలో నటించింది. స్టార్ హీరో సినిమాలో స్టార్ డైరెక్టర్ పిలిచి రెండో హీరోయిన్ పాత్ర ఇచ్చినప్పటికీ.. ఈషా రెబ్బకి ఈ అవకాశం తర్వాత సినిమాలకు పనికొస్తుందని ఆశతో ఉంది. అయితే అరవింద సమేతలో ఈషా రెబ్బ, పూజ హెగ్డే కజిన్స్ అంటే అక్కచెల్లెళ్లుగా కనిపిస్తారని టాక్ ఉంది. ఇక స్టార్ హీరో సినిమాలో వచ్చిన ఈ అవకాశంతో పొంగిపోతున్న ఈషా రెబ్బ కి షాక్ ఇచ్చిందట అరవింద సమేత టీం. ఈ సినిమాలో కథానుసారంగా ఈషా పాత్ర‌కు అంత స్కోప్ లేద‌ట‌. త్రివిక్ర‌మ్ క‌థ‌గా రాసుకున్న‌ప్పుడు ఈషా పాత్ర బాగానే ఉన్నా, ఆ త‌ర‌వాత జ‌రిగిన మార్పుల్లో ఈషా పాత్ర బాగా కుదించుకుపోయింద‌ని టాక్‌.

ట్రైలర్ లో ఇలావచ్చి అలా మాయమై...

అసలు అరవింద షూటింగ్ సెట్స్ మీదకెళ్ళకముందే ఈషా రెబ్బ కి సంబంధించిన స‌న్నివేశాల‌కు బాగా క‌త్తెర్లు ప‌డిపోయాయ‌ని టాక్‌. ఇక ఈషా ఇచ్చిన 15 రోజుల కాల్షీట్లో ఆమెపై తెర‌కెక్కించింది కేవలం నాలుగు స‌న్నివేశాలే అని... ఈషా పాత్ర సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందని.. అందుకే ఈ సినిమాలో ఈషా పాత్ర గొప్పగా ఏమి ఉందనేది ఫిలింసర్కిల్స్ లో నడుస్తున్న టాక్. ఇక అరవింద సమేత ట్రైలర్ చూసినప్పుడు కూడా ఈషా రెబ్బ చాలా చిన్న సీన్ లో కనిపించి మాయమైంది. మరి ఇదంతా చూస్తే పైన చెప్పిందే నిజమేమో అనేలా ఉంది. మరి ఈషా ఏమో తన పాత్ర సినిమా మొత్తం ఉంటుందని.. అది కూడా ఎన్టీఆర్ తో కలిసి ఉంటుందని ఒకానొక ఇంటర్వ్యూ లో చెప్పింది. మరి ఇప్పుడేమో ఈషా రెబ్బ పాత్రకు అరవిందలో ప్రాధాన్యత లేదంటున్నారు.

Similar News