గ్లామర్ మోత మోగించిందిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు గ్లామర్ రోల్స్ ఇవ్వాలంటే దర్శకులు కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే మన తెలుగమ్మాయిని గ్లామర్ రోల్స్ కు సెట్ అవ్వరని అనుకుంటారు. [more]

Update: 2019-03-29 07:22 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు గ్లామర్ రోల్స్ ఇవ్వాలంటే దర్శకులు కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే మన తెలుగమ్మాయిని గ్లామర్ రోల్స్ కు సెట్ అవ్వరని అనుకుంటారు. ఒకవేళ తెలుగు హీరోయిన్స్ గ్లామర్ చూపించినా ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ గా చూపించరు. అందుకే తెలుగు హీరోయిన్స్ పక్క భాషలకు పోయి అందాలు ఆరబోస్తున్నారు. తాజాగా ఒక భామ ఇక్కడ సినిమాలతో మెల్లిగా గ్లామర్ షో చెయ్యడానికి సిద్దమయ్యిది. ఆమె మొదటి నుండి గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అయినా.. అమెకొచ్చిన పాత్రలన్నీ ట్రెడిషనల్ పాత్రలు కావడంతో ఆమె గ్లామర్ హీరోయిన్ గా ఎవ్వరికీ కనిపించలేదు. అంతకు ముందు ఆ తర్వాత, అ!, అమీతుమీ, సుబ్రమణ్యపురం వంటి సినిమాల్లో ట్రెడిషన్ గా కనబడిన ఈషా రెబ్బ.. ఈమధ్య అందాల ఆరబోతకు సై అనడమే కాదు గ్లామర్ షో చేస్తుంది.

ఇప్పుడైనా అవకాశాలు వస్తాయా..?

అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా ప్రాధాన్యత లేని పాత్రలో ఫోకస్ కాని ఈషా రెబ్బ… తాజాగా ఓ హర్రర్ థ్రిల్లర్ లో నటించబోతుంది. అయితే ఈషా రెబ్బ లేటెస్ట్ గా చేయించుకున్న హాట్ ఫోటో షూట్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇప్పటివరకు అంతగా ఎక్స్ పోజ్ చెయ్యని ఈషా రెబ్బ ఇపుడు లేటెస్ట్ ఫోటో షూట్ లో మత్తెక్కించేసింది. ఈషా కెరీర్లో ఇప్పటిదాకా ఇంత గ్లామర్ గా, సెక్సీ గా, ఇంత హాట్ గా ఎప్పుడూ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఒక తెలుగు హీరోయిన్ ఇంత బోల్డ్‌ గా కనిపిస్తుందా అని అందరూ షాకవుతున్నారు. మరి ఈ ఫోటో షూట్ చూసాకైనా దర్శకనిర్మాతలెవరైనా పిలిచి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ ఇస్తారేమో చూద్దాం. ఎందుకంటే ఈషా ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Tags:    

Similar News