ఈ సినిమాలతో అయినా దశ తిరుగుతుందా..!

Update: 2018-10-08 06:04 GMT

హీరోయిన్ అవకాశాల కోసం కుస్తీ పడుతున్న తెలుగమ్మాయి ఇషా రెబ్బ.. హీరోయిన్ గా నటించిన రెండు మూడు సినిమాలు హిట్ అయినప్పటికీ.. ఆమెకి మంచి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ఇక తాజాగా స్టార్ హీరో ఎన్టీఆర్ తో అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఇషాకి ఈ సినిమాతో అయినా లక్కు కలిసొస్తుంది అనుకుంటే... అరవింద సమేత నిడివి ఎక్కువ ఉండడంతో.. ఇషా రెబ్బ సీన్స్ కి కత్తెర పడిందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ లక్కు లేని ఈ హీరోయిన్ కి అరవింద సినిమా అయినా కలిసొస్తుంది అనుకుంటే.. ఆ సినిమాలో ఇషా పాత్రకు పెద్దగా స్కోప్ లేదని నాలుగైదు సీన్స్ లోనే కనిపించబోతుందనే ప్రచారం ఆమెకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

కన్నడలో లెక్చరర్ గా...

ఇక అరవింద సమేతలో ఇషా పాత్రపై క్లారిటీ రావాలంటే.. ఈ నెల 11 వరకు వెయిట్ చేస్తే విషయం తేలిపోతుంది. ఇక అరవింద ఇంకా విడుదల కాకుండానే ఇషా రెబ్బ కి మరో బడా ఆఫర్ వచ్చింది. కన్నడలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఇషా. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా ఇషా ఎంపికయ్యింది. ఇక ఈ సినిమాలో ఇషా కాలేజ్ లెక్చరర్ గా కనిపించనుందనే సమాచారం. ఈ నెలాఖరు నుండి శివరాజ్ కుమార్ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానుంది. ఇప్పటివరకు.. హీరోస్ ని ఆటపట్టించే హీరోయిన్ గా సినిమాలు చేసిన ఇషాకి ఈ లెక్చరర్ పాత్ర ఎలా వుండబోతుందో కానీ.. అరవింద సమేత, శివరాజ్ కుమార్ సినిమాలతో ఈషా రెబ్బ మరింత బిజీ అవుతుందేమో చూడాలి.

Similar News