తెలుగు హీరోయిన్ గ్లామర్ డోస్ కు రెడీ అంటుంది

Update: 2018-09-14 03:32 GMT

తెలుగు హీరోయిన్స్ కి తెలుగులో అవకాశాలు తక్కువే అని అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత అవకాశాలు రాకపోతే మన హీరోయిన్స్ పరభాషా పరిశ్రమ బాట పట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఎంతైనా పొరుగింటి పుల్ల కూర రుచి కదా. అదేంటో ఇక్కడ క్లిక్ అవ్వని వాళ్లు వేరే పరిశ్రమలకు వెళ్లి ఇట్టే సెటిల్ అయిపోతారు.

అసలు విషయం ఏంటంటే..'అంతకుముందు ఆ తరువాత' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా మన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కు తెలుగులో ఇప్పటివరకు సరైన సక్సెస్ లేదు. రీసెంట్ గా ఆమె నటించిన 'బ్రాండ్ బాబు' కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈసినిమాకి ముందు ఆమె ఎన్టీఆర్ సినిమా 'అరవింద సమేత' లో ఛాన్స్ కొట్టేసింది. అందులో ఆమెది చిన్న రోల్ అని తెలుస్తుంది.ఈ సినిమాతో ఎలాగైనా క్రేజ్ తెచ్చకోవాలని గట్టిగానే ట్రై చేస్తుంది.

ఇది ఇలా ఉండగా ఆమె తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడాలని కాస్త గ్లామర్ డోస్ పెంచి, కాస్త బరువు తగ్గి..స్లిమ్ కూడా అయిందట. ఇండైరెక్ట్ గా గ్లామర్ పాత్రలకు రెడీ అని హింట్ ఇస్తూనే కాస్త డోస్ కూడా పెంచేందుకు రెడీ అన్నట్టు సిగ్నల్ ఇస్తుంది. అంతేకాని ఇతర హీరోయిన్స్ లా పరభాషా పరిశ్రమకు వెళ్ళను అని చెప్పేస్తుంది. మరి దింతో ఐన ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Similar News