ప్రభాస్ సరసన దిశా, సారా?

ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లిస్ ఒక్కొక్కటిగా పెరిగిపోతుంది. ప్రభాస్ కి హీరోయిన్స్ సెట్ చేసుకోవడంలో దర్శకులు పోటీ పడుతున్నారు. ప్రభాస్ తదుపరిచిత్రాల కమిట్మెంట్స్ తెలిసినట్టుగా నాగ్ అశ్విన్ [more]

Update: 2020-12-10 09:18 GMT

ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లిస్ ఒక్కొక్కటిగా పెరిగిపోతుంది. ప్రభాస్ కి హీరోయిన్స్ సెట్ చేసుకోవడంలో దర్శకులు పోటీ పడుతున్నారు. ప్రభాస్ తదుపరిచిత్రాల కమిట్మెంట్స్ తెలిసినట్టుగా నాగ్ అశ్విన్ గబా గబా దీపికా పదుకొనేని తెచ్చేసాడు. రాధేశ్యాం లో పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీలో దీపికా పదుకొనేతో రొమాన్స్ చెయ్యబోతున్నాడు. దీపికా – ప్రభాస్ జోడికి ఊహకే అందనంత క్రేజ్ ఉంది. ఇక ఆదిపురుష్ లో ప్రభాస్ కి సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటించే ఛాన్స్ ఉందనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా.. కృతిసనన్ ని ఓం రౌత్ ఎంపిక పూర్తి చేసినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ హీరోయిన్స్ రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోతున్న మాస్ మసాలా సలార్ లో ప్రభాస్ అమాయకమైన కుర్రాడు ఒక నాయకుడిగా ఎలా మారాడో చూపించబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎంపిక కూడా చేపట్టినట్టుగా మీడియా టాక్. ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామలైన దిశా పటాని, సారా అలీఖాన్ లు ప్రశాంత్ నీల్ మదిలో ఉన్నారని.. దిశా కానీ, సారా కానీ ప్రభాస్ పక్కన పర్ఫెక్ట్ జోడిలని అంటున్నారు. మరోపక్క బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే టాప్ రేంజ్ కి వెళుతున్న దిశా కానీ, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ లు సలార్ లో నటిస్తే సినిమాకి మరింత హైప్ వస్తుంది అని.. ప్రభాస్ ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు. 

Tags:    

Similar News