VVR పోతేనేమి.. #RRR ఉందిగా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో డీవీవీ దానయ్య పెద్ద చిత్రాలను నిర్మించే పనిలో బాగా బిజీగా ఉన్నాడు. ఆయన నిర్మిస్తున్న సినిమాల మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ [more]

Update: 2019-01-18 06:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో డీవీవీ దానయ్య పెద్ద చిత్రాలను నిర్మించే పనిలో బాగా బిజీగా ఉన్నాడు. ఆయన నిర్మిస్తున్న సినిమాల మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ కి రంగస్థలం తర్వాత భారీ క్రేజ్ ఉంటుందని రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసాడు. రామ్ చరణ్ – బోయపాటి కలయికలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో కలెక్షన్స్ రాబట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మించి ఈ సినిమా మాస్ ని తలపిస్తుండడంతో… ఫ్యామిలీ అండ్ క్లాస్ ఆడియన్స్ ఆ సినిమాకి దూరమవడంతో.. వినయ విధేయ రామ కలెక్షన్స్ అనుకున్నట్టుగా లేవు. అందులోనూ సినిమా విడుదలైన మరు నిమిషమే ఆ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చేసింది. అయితే దానయ్య కు పెద్దగా లాస్ ఉండదు. ఎందుకంటే సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసి నిర్మాత దానయ్యకు లాభాలు తేకపోయినా.. నష్టాలూ రాలేదు. ఇక లాభాలు రాకపోవడానికి కారణం.. బోయపాటి దానయ్య చేత సినిమాకి ఎడాపేడా ఖర్చు పెట్టించడమే.

ఒకటి పోతేనేం… మరోటి ఉందిగా…

కానీ బయ్యర్లకు లాస్ తప్పదు అనేలా ఉంది. మరి ఎలాగైనా దానయ్యకి వినయ విధేయ రామ గట్టి దెబ్బేసినట్లే. పోనిలే అది పోతేనేమి. ఆయన తదుపరి చిత్రం #RRR ఉందిగా. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న #RRR సినిమా షూటింగ్ మొదలై ఫస్ట్ షెడ్యూల్ కూడా జరుపుకుని.. సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతుంది. మరి దానయ్య ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ అంటే దాదాపుగా 200 నుండి 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాకి పెట్టిన దానికన్నా రెండింతలు లాభాలు దానయ్యకు వస్తాయి. ఎందుకంటే #RRR కాంబో అలాంటిది కనక. మరి VVR పోయినా… #RRR తో గట్టిగా లాభపడొచ్చు. అదే దానయ్య ధైర్యం కూడా.

Tags:    

Similar News