దసరా హడావుడి మామూలుగా లేదు..!

Update: 2018-10-17 10:21 GMT

టాలీవుడ్ లో చిన్నా లేదు పెద్దా లేదు ఏ పండగ వచ్చినా సినిమాల విడుదల హడావిడి ఒక ఎత్తైతే... సినిమాల ఫస్ట్ లుక్ లు, ఫస్ట్ టీజర్స్ అంటూ పెద్ద ఎత్తున హడావుడి జరుగుతుంది. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు తమ సినిమాల లుక్స్ తో సందడి చేస్తారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న పెద్ద ప్రొజెక్టలులైన రామ్ చరణ్ - బోయపాటి #RC12 సినిమా లుక్, టైటిల్ ఈ దసరాకే విడుదల చేస్తున్నట్టుగా... వినయ విధేయ రామ, రౌడీ తమ్ముడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక ప్రభాస్ కూడా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో లుక్ తో పాటు రాధాకృష్ణ సినిమా లుక్ కూడా విడుదల చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

కళ్యాణ్ రామ్ లుక్ కూడా...

అలాగే ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా లుక్స్ విరివిగా విడుదల చేస్తున్నట్లుగానే... ఈ దసరాకి కూడా కళ్యాణ్ రామ్ హరికృష్ణ లుక్ ని విడుదల చేస్తారేమో అనే టాక్ వినబడుతుంది. ఇటీవ‌ల కళ్యాణ్ రామ్ సెట్‌లోకి వెళ్లాడు. ఆయ‌న‌పై కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. ఈ సందర్భంగా చిత్ర‌బృందం ఓ ఫొటోని కూడా విడుద‌ల చేసింది. అందులో క‌ల్యాణ్‌రామ్ అటువైపు తిరిగి ఉన్న లుక్. ఈసారి పూర్తి లుక్ బ‌య‌ట‌కు వ‌దల‌బోతుందంటున్నారు.

సైరా లుక్ వస్తుందా..?

ఇక చిరంజీవి - సురేందర్ రెడ్డిల సైరా లుక్ కోసం కూడా మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి సైరా లుక్ విషయంలో క్లారిటీ లేదుగాని సైరా నుండి ఒక లుక్ మాత్రం ఈ దసరాకి రావాలని మెగా ఫాన్స్ చూస్తున్నారు. ఇక మీడియం బడ్జెట్ మూవీస్ వెంకటేష్ - వరుణ్ తేజ్ ల ఎఫ్2తో పాటు వరుణ్ తేజ్ అంతరిక్షం లుక్ కూడా రాబోతుంది. ఇక చైతు సవ్యసాచి, మహేష్ మహర్షి లుక్ కూడా ఈ దసరాకి సిద్ధంగా ఉన్నాయంటున్నారు. ఇంకా చాలా సినిమాల లుక్స్ మాత్రం సందడి చెయ్యబోతున్నాయి.

Similar News