డబ్బింగ్ సినిమాల దండయాత్ర..!

ఈ ఫిబ్రవరి బాక్సాఫీసును మరీ ఉసూరుమనిపించేస్తుంది. ఫిబ్రవరి 1న సోదిలో లేని సినిమాలు విడుదలైతే గత శుక్రవారం వైఎస్సార్ బయోపిక్ యాత్ర విడుదలైంది. ఇక యాత్ర సినిమాతో [more]

Update: 2019-02-12 06:59 GMT

ఈ ఫిబ్రవరి బాక్సాఫీసును మరీ ఉసూరుమనిపించేస్తుంది. ఫిబ్రవరి 1న సోదిలో లేని సినిమాలు విడుదలైతే గత శుక్రవారం వైఎస్సార్ బయోపిక్ యాత్ర విడుదలైంది. ఇక యాత్ర సినిమాతో పాటుగా అమావాస్య, విచారం అంటూ ఊరు పేరు లేని సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. వీటింటే యాత్ర బెటర్ అనేలా ఉంది. ఇక ఈ శుక్రవారం ఒక్క తెలుగు సినిమా కూడా విడుదలయ్యే సినిమాల లిస్ట్ లో లేదు. ఫిబ్రవరి 14న రెండు డబ్బింగ్ సినిమాలు మాత్రం దిగుతున్నాయి. తెలుగు సినిమాలేవీ విడుదల కాకపోవడం… ఆ సినిమాలకు అడ్వాంటేజ్ కానుంది. మలయాళం నుండి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే సినిమా ఒకటి, మరొకటి కార్తీ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన దేవ్ సినిమా ఈ 14న థియేటర్స్ లోకి రాబోతున్నాయి. మరి ఈ రెండు డబ్బింగ్ సినిమాలకు ఎదురు నిలిచే ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం అనేది ఆ రెండు సినిమాలకు అడ్వాంటేజే.

రెండు డ‌బ్బింగ్ సినిమాల‌తో

ఇక కన్నుగీటుతో గన్ పేల్చిసి తెగ పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ లవర్స్ డే మీద పెద్దగా అంచనాలు లేకపోయినా… ఆ అమ్మాయి నటన, గ్లామర్ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంది. ఇక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్, తెలుగులో కాస్తో కూస్తో మార్కెట్ సంపాదించిన కార్తీ జంటగా తెరకెక్కిన దేవ్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కార్తీ ప్రతి సినిమా తెలుగులో డ‌బ్ అవడం, హీరోయిన్ రకుల్ ప్రీత్ కావడంతో దేవ్ సినిమా మీద మంచి అంచనాలు, ప్రేక్షకులలో ఆసక్తి ఉన్నాయి. మరి తెలుగు సినిమాలు చేతులెత్తేసిన టైంలో తమ ప్రతాపం చూపించడానికి ఈ రెండు డబ్బింగ్ సినిమాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక లవర్స్ డే ప్రమోషన్స్ కన్నా ఒకింత ఎక్కువగా దేవ్ ప్రమోషన్స్ ఉన్నాయి. రకుల్ తెలుగు ఛానల్స్ కి ఇంటర్వూస్ గట్రా ఇస్తూ దేవ్ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంది.

Tags:    

Similar News