ఫీలయినా.. పేమెంట్ వస్తుందిగా!!

జబర్దస్త్ లో కమేడియన్ గా క్లిక్ అయితే చాలు.. భారీ రెమ్యునరేషన్, వెండితెర మీద అవకాశాలు, బయట బోలెడంత ఫేమ్.. అంతా విషయం మాములుగా ఉండదు. అందరూ [more]

Update: 2020-07-28 10:27 GMT

జబర్దస్త్ లో కమేడియన్ గా క్లిక్ అయితే చాలు.. భారీ రెమ్యునరేషన్, వెండితెర మీద అవకాశాలు, బయట బోలెడంత ఫేమ్.. అంతా విషయం మాములుగా ఉండదు. అందరూ చమ్మక్ చంద్ర, హైపర్ ఆది,సుడిగాలి సుధీర్ అవలేరు. కానీ ఎవరి కామెడీ వారిది. ప్రేక్షకులను నవ్విస్తే జబర్దస్త్ లో చోటు పదిలం. అయితే చమ్మక్ చంద్ర, హైపర్ ఆది లాంటి వాళ్ళు టీం మెంబెర్స్ మీదే జోక్స్ వేసి మరీ కామెడీ చేస్తుంటారు. హైపర్ ఆది తన టీంలోని కమెడియన్స్ మీదే పంచ్ లు వేస్తూ కామెడీ చేస్తాడు. రైజింగ్ రాజు మీద, దొరబాబు యూట్యూబ్ వీడియోస్ మీద వేసిన పంచ్ వెయ్యకుండా కామెడీ పుట్టిస్తాడు. అయితే మొన్నామధ్యన వైజాగ్ సెక్స్ రాకెట్ లో అడ్డంగా బుక్ అయిన దొరబాబు, పరదేశిలని హైపర్ ఆది టీం నుండి తీసేస్తాడనుకుంటే.. వాళ్ళని టీంలోకి తీసుకుని షాకిచ్చాడు.

అంతేనా కరోనా లాక్ డౌన్ ముగియగానే దొరబాబు ని తెరపైకి తీసుకురావడమే కాదు…. దొరబాబు యూట్యూబ్ వీడియోస్ పంచ్ లు పక్కనపడేసి.. ఇప్పుడు వైజాగ్ పోలీస్ స్టేషన్ పంచ్ లు పేలుస్తున్నాడు. ఆ పంచ్ లు కామెడిగానే ఉన్నా దొరబాబు, పరదేశి ఖచ్చితంగా ఫీలవుతారు. వీలున్నప్పుడల్లా వైజాక్ సెక్స్ రాకెట్ కేసు మీదే కామెడీ చేస్తుంటే.. దొరబాబు అండ్ పరదేశీలు ఫీలవుతున్నారట. ఆ విషయం సన్నహితుల దగ్గర చెప్పుకుని బాధపడుతున్నారట. హైపర్ ఆది వేసే పంచ్ లకి ఫీలవుతున్నా ఆది ఇచ్చే రెమ్యునరేషన్ కి దొరబాబు మారు మాట్లాడడం లేదని టాక్. తాజా ఎపిసోడ్ లోను హైపర్ ఆది దొరబాబును పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చాంటూ సెటైర్ వేశాడు. అంతేకాదు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లోనే దొరబాబు ఉంటాడని మరో సెటైర్ వేశాడు. దీనితో దొరబాబు బాగా హార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అయినా జబర్దస్త్ లో టైం కి పేమెంట్స్ ఇచ్చే వారిలో హైపర్ ఆది ముందుటాడు కాబట్టే దొరబాబు నోరు మెదపకుండా ఆది సెటైర్స్ కి తల వంచుతూన్నాడేమో.

Tags:    

Similar News