కల్కి రైటర్ కి అవకాశాలు

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ లేటెస్ట్ మూవీ కల్కి జూన్ 28 న రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తో పర్లేదు అనిపించుకుంటుంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ [more]

Update: 2019-07-06 05:15 GMT

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ లేటెస్ట్ మూవీ కల్కి జూన్ 28 న రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తో పర్లేదు అనిపించుకుంటుంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు సాయి తేజ దేశరాజు అనే రైటర్ కథ అందించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడు..” నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడం అంటే ఇష్టం. నేను ఆన్‌ లైన్‌ లో ఓ వెబ్‌ సైట్‌ లో ఈ ‘కల్కి’ కథను 46 ఎపిసోడ్స్‌ గా రాశాను. అది చదివిన ఓ వ్యక్తి నన్ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి పరిచయం చేసాడు.

అప్పుడు ప్రశాంత్ నన్ను నీ దగ్గర ఏదేమైనా మంచి కథ ఉంటె చెప్పు అంటే అప్పుడు ఈ కథ చెప్పాను.రాజశేఖర్‌ గారికి బాగా నచ్చింది. వెంటనే సినిమా సెట్స్‌ మీదకి వెళ్ళింది. అలా కల్కి సక్సెస్ అవ్వడంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది.రీసెంట్ గా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్‌ కూడా కాంటాక్ట్‌ అయ్యారు. వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వీక్ లో హీరో రాజశేఖర్‌ గారికి మరో కథ చెప్పబోతున్నాను. అది మంచి ఎమోషన్‌తో కూడిన కాప్‌ థ్రిల్లర్‌. ఆయన తప్పకుండ ఈ కథ కు కనెక్ట్ అవ్వుతారు అని అనుకుంటున్నా అని ఆయన అన్నారు. అలానే రీసెంట్ గా ‘కార్తికేయ’ సినిమా నిర్మాత వెంకట శ్రీనివాస్‌ గారికి ఒక సీరియల్‌ కిల్లర్‌ కి సంబంధించిన స్టోరీ చెప్పడం జరిగింది. ఆయన ఆ కథకు కనెక్ట్ అయ్యి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. దాని టైటిల్ కూడా ‘కిన్నెరసాని’ అని పెట్టుకున్నాం. అని రైటర్‌ సాయి తేజ దేశరాజు అన్నారు.

Tags:    

Similar News