విజయ్ దేవరకొండ ఇష్టమా? నితిన్ ఇష్టమా?

విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలు, నితిన్ తో ఒక్క సినిమా చేసిన రష్మిక మందన్న కి మీకు విజయ్ అంటే ఇష్టమా? నితిన్ అంటే ఇష్టమా? [more]

Update: 2020-04-29 06:28 GMT

విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలు, నితిన్ తో ఒక్క సినిమా చేసిన రష్మిక మందన్న కి మీకు విజయ్ అంటే ఇష్టమా? నితిన్ అంటే ఇష్టమా? అని అడిగితె.. మీకు ఎవరంటే ఇష్టం అంటూ తెలివైన సంధానం చెప్పింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ క్వారంటైన్ గడుపుతున్న రష్మిక సరదాగా… సోషల్ మీడియా లైవ్ చాట్ లో అభిమానులతో  ముచ్చటించింది. లాక్ డౌన్ ముగియగానే తాను చేసే మొదటి పని.. వెంటనే వెళ్లి ఫ్రెండ్స్ ని కలవడం అని..ఖాళీ సమయంలో కేకులు, వంటలు తయారు చేస్తుంటా అని చెబుతుంది.

ఇక మీకు హిందీ మాట్లాడడం వచ్చా.. అని అడిగితే.. వారికీ హిందీలో సమాధానం చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఇక రష్మిక పుష్ప కోసం పాన్ ఇండియా హీరోయిన్ గా మారడంతో ఆమెపై మరింత క్రేజ్ పెరిగింది. అయితే పుష్ప కోసం మీరు విభిన్న యాస నేర్చుకుంటున్నారా అని అడిగితె….అది మీకెలా తెలుసు అంటూ నవ్వేసింది. ఇక హిందీలో నటిస్తారా అనగా… ఆలోచిస్తా అని… తమిళ సినిమా ఎమన్నా చేసారా.. అని అడిగితె.. నటించాను.. కానీ లాక్ డౌన్ ముగిసాక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని చెప్పడమే కాదు… నటి కాకపోయి ఉంటే… అనగా జీవితాంతం క్వారంటైన్ లో ఉండేదాన్ని అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది.

Tags:    

Similar News