అందరూ ఆమెనే పొగిడేస్తున్నారు..!

ఈ ఏడాది వేసవికి శుభారంభం చేసింది మజిలీ సినిమా. ఈ సినిమాని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కించి దర్శకుడు శివ నిర్వాణ ప్రశంసలు అందుకున్నాడు. ఇక పూర్ణగా [more]

Update: 2019-04-10 06:59 GMT

ఈ ఏడాది వేసవికి శుభారంభం చేసింది మజిలీ సినిమా. ఈ సినిమాని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కించి దర్శకుడు శివ నిర్వాణ ప్రశంసలు అందుకున్నాడు. ఇక పూర్ణగా నాగచైతన్య నటనకు అందరూ ముగ్దులవుతున్నారు. నాగచైతన్య పూర్ణ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. ఇక మజిలీ సినిమాకి శ్రావణి పాత్ర జీవం పోసింది. శ్రావణిగా సమంత కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. అందులో సందేహమే లేదు. కానీ మజిలీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ మాటేమిటి. ఎక్కడా ఆమెని పొగిడిన దాఖలాలు లేవు. మజిలీ సినిమా చైతు – సమంతల వల్లనే ఆడేస్తుందని, సినిమా నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిందని మాములుగా ప్రచారం జరగడం లేదు.

దివ్యాంశ బాగా నటించినా…

మరి సినిమా ఫస్ట్ హాఫ్ లో బాధ్యతలు మోసిన దివ్యంశ మాటేమిటి. అన్షుగా ఆమె నార్త్ ఇండియన్ అమ్మాయిగా మంచి పెరఫార్మెన్స్ ఇచ్చింది. చైతు ఆమెని డీప్ గా లవ్ చెయ్యడం, ఆమె కూడా చైతుని లవ్ చెయ్యడం, అలాగే చైతుతో లిప్ లాక్ కిస్ అన్నీ ప్రేక్షకులకు నచ్చాయి. నాగ చైతన్య – దివ్యంశ రొమాంటిక్ ట్రాక్ బాగా పండించింది. కానీ దివ్యంశ నటన బాగుందని అన్నారు కానీ ఆమెని పెద్దగా ఫోకస్ కానివ్వడం లేదు. కేవలం చైతు, సమంతలనే ఆకాశానికెత్తేస్తున్నారు. ఏది ఏమైనా మజిలీ హిట్ లో దివ్యంశ తన వంతు కష్టపడింది.

Tags:    

Similar News