హిట్ కొట్టినా ఛాన్స్ లు లేవు..!

నార్త్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ ‘మజిలీ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమై తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ అందరినీ ఆకట్టుకుంది. ‘మజిలీ’ సినిమాలో సమంత [more]

Update: 2019-05-04 08:54 GMT

నార్త్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ ‘మజిలీ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమై తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ అందరినీ ఆకట్టుకుంది. ‘మజిలీ’ సినిమాలో సమంత కూడా నటించడంతో క్రెడిట్స్ మొత్తం సామ్ కే వెళ్లిపోయాయి. దివ్యాంశకు రావాల్సిన పేరు రాకపోవడంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ లేకుండా పోయాయి. సినిమాలో మంచి యాక్టింగ్ తో పాటు గ్లామర్ గా కూడా ఆకట్టుకున్న దివ్యాంశ కౌశిక్ కు ‘మజిలీ’ తరువాత ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు.

అవకాశం కోసం ఎదురుచూపులు

సినిమా హిట్ అయ్యి డైరెక్టర్, నాగ చైతన్య, సమంత నెక్స్ట్ మూవీస్ లో బిజీ అయిపోతే తాను మాత్రం ఇంకా ఎవరు వచ్చి ఛాన్స్ ఇస్తారు అని ఎదురు చూస్తుంది. చైతుతో నటించి ఫ్లాప్ అందుకున్న నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు కూడా మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ అందుకుని దివ్యాంశ కౌశిక్ ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. పాపం దయతలచి చైతు కానీ డైరెక్టర్ శివ నిర్వాణ కానీ ఛాన్స్ ఇస్తారు అని ఆశిద్దాం.

Tags:    

Similar News