కెరీర్ స్టార్ట్ అవుతుంది అన్నావ్.. అయ్యిందా దివి?

బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన వారంతా బాగా ఫీలవుతూ నాగార్జున దగ్గరకి అంటే బిగ్ బాస్ స్టేజ్ మీదకి తట్టా బుట్టా సర్దుకుని వస్తారు. స్టేజ్ [more]

Update: 2020-11-08 06:06 GMT

బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన వారంతా బాగా ఫీలవుతూ నాగార్జున దగ్గరకి అంటే బిగ్ బాస్ స్టేజ్ మీదకి తట్టా బుట్టా సర్దుకుని వస్తారు. స్టేజ్ మీద బాధపడుతూ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ స్టేజ్ దిగి వెళ్ళిపోయాక… ఛానల్స్ లో కూర్చుని బిగ్ బాస్ లో అలాగా.. బిగ్ బాస్ ఇలాగా అంటూ తెగమాట్లాడేస్తారు. అయితే దసరా పండగ రోజున సమంత హోస్టింగ్ లో దివి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుండి బయటికి వెళుతూ వెళుతూ దివి ఓ మాటంది.. అది నేను వెళ్తున్నాని బాధపడకండి.. నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటూ నవ్వుతూ వెళ్లడమే కాదు.. బయట కూడా ఛానల్స్ ఇంటర్వూస్ లో ఎవరికీ దొరక్కుండా బిగ్ బాస్  గురించి పాజిటివ్ గా మాట్లాడింది. అమ్మ రాజశేఖర్ తో క్లోజ్ గా వున్నారు.. ప్రేమిస్తున్నారా అంటే నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళింది ప్రేమించడానికి కాదు.. కెరీర్ లో క్రేజ్ తెచ్చుకోవడానికి అంటూ క్లారిటీగా ఉంది.

మరి బిగ్ బాస్ నుండి దివి బయటికి వచ్చాక ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. దివి నడుము అందాల గురించిన టాపిక్ టాలీవుడ్ లో చర్చకు వచ్చింది. మరి ఎన్నో ఆశలతో హౌస్ నుండి బయటికి వచ్చిన దివి కి ఏమైనా సినిమా అవకాశాలు వచ్చాయా? హౌస్ లోకి వెళ్లక ముందు గతంలో మహేష్ మహర్షిలో నటించిన దివి ఇప్పుడు హీరోయిన్ అవకాశాలతో పాటుగా ఎలాంటి మంచి కేరెక్టర్ వచ్చిన వదలనని చెబుతుంది. మరి దివి కి ఇప్పటివరకు దర్శకనిర్మాతలెవరైనా సినిమా అవకాశాలిచ్చారా? దివి డీసెంట్ గా ఉండే అమ్మాయి కాబట్టి ఆమెకి ఎవరైనా అవకాశాలు ఇస్తారు. కానీ హీరోయిన్ అంటే… కష్టం. దివి చాలా ఎక్కువ హైట్ కాబట్టి.. ఏ సెకండ్ హీరోయిన్స్ ఛాన్సెస్ అయినా వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Tags:    

Similar News