బాబోయ్ అనిపిస్తున్న దిశా..!

Update: 2018-09-21 06:23 GMT

సోషల్ మీడియా వచ్చాక ఎవరూ ఆగడం లేదు. ఎవరికి నచ్చినట్టు వారు తమ సోషల్ మీడియా అకౌంట్ లో ఏది పడితే అది షేర్ చేసి ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా మన ఇండియన్ హీరోయిన్స్. వీరి చేతికి ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ దొరికింది. అంతే తమ పర్సనల్ ఫొటోస్.. షూటింగ్ అప్ డేట్స్ అన్నీ అందులో షేర్ చేసుకుంటున్నారు. అవకాశాలు రావట్లేదు అనే వారికి ఇది ఒక ప్లాట్ ఫార్మ్ గా మారింది. ప్రేక్షకులు ఒక క్లిక్ తో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొన్ని గంటల కిందట దిశా పటాని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ ఫోటో ను షేర్ చేసింది. ఫోటో అంటే అటువంటి ఇటువంటి ఫోటో కాదండోయ్. ఎర్ర బికినీతో కుర్రకారులకు మతిపోయేలా ఆ ఫోటో ఉంది. దిశాకి ఇది ఏమీ కొత్త కాదు. గతంలో బ్లాక్ బికినీ వేసుకుంది. ఇప్పుడు రెడ్ కలర్ బికిని వేసుకుని నేను చాలా హాట్ గురు అని చెబుతుంది. ఆ ఫోటోను పోస్ట్ చేసిన దిశా దాని కింద 'పువ్వు బొమ్మ' పెట్టింది.

టైగర్ చాలా లక్కీ...

మరి ఆ పువ్వు ఎందుకు పెట్టిందో ఆమెకే తెలియాలి. పెట్టిన రెండు గంటల్లోనే 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఆమె యూత్ ని ఎంతలా ఎట్రాక్ట్ చేసిందో. కామెంట్స్ కూడా అదే విధంగా వచ్చాయి. అందులో ఒక కామెంట్...'టైగర్ బహుత్ లక్కీ హై' అని పెట్టారు. టైగర్ ష్రాఫ్ ను ఉద్దేశించి ఆ కామెంట్ పెట్టారు. టైగర్ నువ్వు చాలా లక్కీ అని అర్ధం.

Similar News