కాజల్ కి అలాంటి జబ్బు ఉందా..?

Update: 2018-12-05 08:47 GMT

హీరోయిన్ కాజల్ గ్లామర్ కి మారు పేరు. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఒకే రకమైన గ్లామర్ ని మెయింటైన్ చేసుకుంటూ వస్తోంది. గత రెండేళ్లుగా కాజల్ హవా టాలీవుడ్ లో తగ్గినట్లుగా కనిపించినా... అదేం లేదు నేను బిజీ అంటూ వచ్చిన అవకాశాలతో టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బెల్లకొండ శ్రీనివాస్ సరసన వరసగా రెండు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస్ - కాజల్ ల కవచం రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. ప్రస్తుతం కవచం ప్రమోషన్స్ లో ఉన్న కాజల్ కవచం విషయాలతో పాటుగా వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.

మూడు నెలలు బయట ప్రపంచం చూడలేదు...

తనకి ఒక ఆరోగ్య సమస్య ఉందని .. అందుకే ఒక మూడు నెలలు షూటింగ్స్ కి, సినిమాలేమి ఒప్పుకోలేదని చెబుతుంది. తన కొచ్చిన వ్యాధి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని... ఆ వ్యాధి లక్షణాలు.. హఠాత్తుగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం అని చెబుతుంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్ జబ్బు వలన తాను మూడు నెలలు మంచానికే పరితమయ్యానని.. ఆ మూడు నెలలు బయట ప్రపంచాన్ని చూడలేదని చెబుతుంది. ఈ ఏడాది మొదట్లో ఒక సినిమా షూటింగ్ టైంలో ఈ వ్యాధి బారిన పడ్డానని చెబుతుంది. అయితే ఆ వ్యాధి లక్షణాలు జ్వరం, ఒళ్లు నొప్పులుతో.. వరుసగా జ్వరం రావడంతో డాక్టర్లను సంప్రదించనని చెప్పిన కాజల్ అసలు సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పింది.

ఎవరికీ ఈ విషయం తెలియదు...

అయితే తనకి ఈ వ్యాధి వచ్చినట్లుగా బయటివారికి తెలియదని.. కేవలం తన ఫ్యామిలీ మెంబెర్స్ కి తప్ప మరెవరికి తెలియదని.. అందుకే తన ఆరోగ్యంపై కనీసం చిన్న విషయం కూడా బయటికి రాలేదని చెబుతుంది కాజల్. ఇక కవచం సినిమా హిట్ మీద కాజల్ ధీమా వ్యక్తం చేసింది.

Similar News