డిస్కో రాజా కూడా ఏం చెయ్యలేకపోయింది

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఏ రేంజ్ లో దూసుకెళుతుందో అనేది ఈ వీకెండ్ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది. రెండు వారాలుగా [more]

Update: 2020-01-26 07:30 GMT

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఏ రేంజ్ లో దూసుకెళుతుందో అనేది ఈ వీకెండ్ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది. రెండు వారాలుగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న అల వైకుంఠాపురానికి రవితేజ డిస్కో రాజా కూడా అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. మూడో వారంలోను అల హావ ఇంకా ఆగలేదు. రవితేజ డిస్కో రాజాకి ప్లాప్ టాక్ పడడంతో.. అల్లు అర్జున్ అల వైకుంఠానికి మూడో వారం కూడా లైన్ క్లియర్ అయ్యింది. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం కూడా అల వైకుంఠపురములో మల్టిప్లెక్స్ థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.

డిస్కో రాజా కి థియేటర్స్ కొరత ఉన్నప్పటికీ… అల వైకుంఠపురములో సినిమాకి డిస్కో రాజా కన్నా ఎక్కువ థియేటర్స్ ఉండడంతో ఈ వీకెండ్ తాజాగా అల వైకుంఠమే ఉండబోతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా సర్దుకోవడంతో అల వైకుంఠపురములో ఊపందుకుంది. ఇక డిస్కో రాజా పడుకోవడం అలా కి అల కలిసొచ్చింది. మరి మూడో వీకెండ్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అంటూ అదరగొట్టడం ఖాయం.

Tags:    

Similar News