చిన్న హీరోల వైపు పెద్ద డైరెక్టర్ చూపు

Update: 2018-06-09 11:15 GMT

త్రివిక్రమ్ కి మొదటినుండి స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలని ఉంటుంది. మొదట్లో తరుణ్ తో దర్శకుడిగా కెరీర్ స్టార్ చేసిన త్రివిక్రమ్ బ్యాక్ టు బ్యాక్ మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో ఇలా రిపీటెడ్ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఆయన దృష్టిలో ఎప్పుడు యావరేజ్ హీరోలు పడలేదు. కానీ మధ్యలో అంటే అజ్ఞాతవాసి ముందు పవన్ కళ్యాణ్ ఖాళీ లేకపోవడంతో నితిన్ వంటి మీడియం రేంజ్ హీరోని పెట్టి అ..ఆ సినిమా చేసి హిట్ కొట్టిన త్రివిక్రమ్ కి అజ్ఞాతవాసి హిట్ అయితే గనక మళ్ళీ స్టార్ హీరోలని నమ్ముకునేవాడు. కానీ అజ్ఞాతవాసి ఫెయిల్ అవడంతో... ఆ టైం లో కమిట్ అయిన ఎన్టీఆర్ తో అరవింద సామెత సినిమాని చేస్తున్నాడు.

మహేశ్ మొహం చాటేస్తున్నాడా..?

త్రివిక్రమ్ కి స్టార్ హీరోలు మొహం చాటేస్తున్నారనే టాక్ ఉంది కానీ అది నిజం కాదు. ఒక ఇంటిలిజెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేసి ఫ్లాప్ అయితే.. ఆ డైరెక్టర్ కి స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వరు అనేది అవాస్తవం. ఆయన టాలెంట్ ని నమ్మే వాళ్లు చాలామంది హీరోలే ఉంటారు. కానీ మహేష్ బాబు ఎందుకో త్రివిక్రమ్ ని పక్కన పెట్టి వరుసగా ఇతర డైరెక్టర్స్ కి కమిట్ అవడంతో.. త్రివిక్రమ్ నుండి మహేష్ బాబు మొహం చాటేసాడన్నారు. మరి అది నిజమో కాదో క్లారిటీ లేదు. కానీ త్రివిక్రమ్ కి మాత్రం అజ్ఞాతవాసి తర్వాత జ్ఞానోదయం అయ్యి.. ఇప్పుడు మీడియం హీరోల వైపు దృష్టి సారించాడనే టాక్ నడుస్తుంది.

నానితో మీడియం బడ్జెట్ మూవీ

ఎన్టీఆర్ అరవింద సామెత తర్వాత త్రివిక్రమ్, నాని తో సినిమా చెయ్యడానికి కమిట్ అవుతున్నట్టుగా ప్రచారం తెగ జోరుగా సాగుతుంది. ఇక నాని తో చెయ్యబోయే సినిమాని మీడియం బడ్జెట్ తో లాగించేయాలనే నిర్ణయంతో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. మరి ఈ వార్త నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాని కూడా నాగ్ తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ తర్వాత ఇంతవరకు వేరే డైరెక్టర్ కి కమిట్ అవ్వలేదు. మరి ఎంతో ఆలోచన శక్తి, మాటల దిట్ట, మేధావి, ఫుల్ టాలెంట్ ఉన్న త్రివిక్రమ్ స్టార్ హీరోలను వదిలెయ్యడం అనేది శుభ పరిణామమే... అలా అని ఆయన సినిమాలు కేవలం మీడియం రేంజ్ కి పడిపోతాయి అంటే మాత్రం కుదదు. త్రివిక్రమ్ సత్తా ఎలాంటిదంటే... తన మాటలు, కామెడీ తోనే సినిమాని హిట్ చెయ్యగల సత్తా వున్న డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ మరీ దిగజారిపోయాడంటే వినడానికే బాగోదు.

Similar News