బ్రేకింగ్ న్యూస్: 'ఎన్టీఆర్' బయో పిక్ నుండి తేజ అవుట్!

Update: 2018-04-25 15:02 GMT

బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఎన్టీఆర్' బయో పిక్ ని 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తో ఫామ్ లోకొచ్చిన తేజ డైరెక్షన్ చేస్తున్నాడు. బాలకృష్ణ 66 గెటప్స్ లో కనబడనున్న ఈ సినిమా గత నెల 29 నే భారీ హంగులతో పూజా కార్యక్రమాలతో మొదలై ఏకధాటిగా రెండు రోజుల పాటు షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే మొదటినుండి ఇంత భారీ సినిమా తేజ హ్యాండిల్ చేయగలడా అనే మీమాంశలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. బాలకృష్ణ గత కొన్నాళ్లుగా ప్లాప్స్ లో ఉన్న తేజ కి ఒక్క సినిమా హిట్ తో ఇంత పెద్ద బాధ్యత మీద పెట్టడం కరెక్ట్ కాదేమో అనే అనుమానం అందరిలోనూ ఉంది.

మరి అందరి మాటను పెడచెవిన పెట్టిన బాలకృష్ణ ఇండస్ట్రీలోని పెద్దలను, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కూడా పిలిచి మరి ఎన్టీఆర్ బయో పిక్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇక బాలకృష్ణ మొదటిరోజే దుర్యోధనుడిగా ఇరగదీసే పెరఫార్మెన్స్ చేసాడు. అయితే వచ్చేనెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న 'ఎన్టీఆర్' బయో పిక్ నుండి దర్శకుడు తేజ బయటికెళ్లిపోయాడనే షాకింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది.

అయితే తేజ ఎందుకు ఎన్టీఆర్ బయో పిక్ నుండి తప్పుకున్నాడో అనేది కారణాలు తెలియాల్సి ఉంది.

అయితే బాలకృష్ణ కి ఉన్న దుందుడుకు తనానికి తేజ ఎమన్నా ఫీల్ అయ్యాడా.. అనే అనుమానం మాత్రం కలుగుతుంది. మరి పాపం తేజ 'ఎన్టీఆర్' బయో పిక్ కోసం వేంకటేష్ తో చెయ్యాల్సిన 'ఆట నాదే వేట నాదే' సినిమాని అటకెక్కించాడు. మరి బాలయ్య మీద నమ్మకంతో ఎన్టీఆర్ బయో పిక్ పై తేజ గత ఆరు నెలలుగా చాలా రీసెర్చ్ చేసాడు. మరి అంతా బాగున్నాక తేజ ఇలా ఎన్టీఆర్ బయో పిక్ నుండి బయటికి రావడం మాత్రం నిజంగా షాకింగ్ న్యూసే

Similar News