తేజ పోవడానికి.. క్రిష్ రావడానికి కారణం ఏమిటంటే.

అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ బయోపిక్ ని నందమూరి బాలకృష్ణ తేజ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. అలాగే మొదటి షెడ్యూల్ లో తేజ దర్శకత్వంలో కొన్ని రోజులు షూటింగ్ [more]

Update: 2019-01-06 07:47 GMT

అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ బయోపిక్ ని నందమూరి బాలకృష్ణ తేజ దర్శకత్వంలో మొదలు పెట్టాడు. అలాగే మొదటి షెడ్యూల్ లో తేజ దర్శకత్వంలో కొన్ని రోజులు షూటింగ్ జరిగినాక… అనుకోకుండా తేజ బయటికెళ్లిపోయాడు. అయితే తేజ బయటికెళ్ళాక అనేక అనుమానాలు ఎన్టీఆర్ బయోపిక్ ని చుట్టుముట్టాయి. ఇక తేజ వెళ్లిపోవడం.. ఆ తర్వాత క్రిష్ మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ ని హ్యాండిల్ చెయ్యడం చక చక జరిగిపోయాయి. అయితే అప్పట్లో తేజ బయటికెళ్ళడం, క్రిష్ రావడంతో అనేకరకాల ఊహాగానాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాలయ్య దెబ్బకి తేజ భయపడ్డాడని… బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ చెయ్యలేక తేజ చేతులెత్తేశాడని అన్నారు. తర్వాత దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని చాలా చక్కగా తెరకెక్కించాడు.

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు విడుదల సందర్భంగా మీడియా ఇంటర్వూస్ లో పాల్గొంటున్న బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ బయటికెళ్లడానికి.. ఆ ప్లేస్ లోకి క్రిష్ రావడానికి గల కారణాలు చెప్పేసాడు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత తేజ ఈ బరువును తాను మొయ్యలేనని చాలా సతమతవడంతో… తేజ దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడని.. ఆ విషయాన్నీ ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్ర చేస్తున్న విద్య బాలన్ కి చెప్పడానికి ముంబై వెళ్ళామని చెప్పిన బాలకృష్ణ.. ముంబై లో మణికర్ణికా షూటింగ్ లో ఉన్న క్రిష్ తనని కలవడానికి అక్కడకి వచ్చాడని చెప్పాడు.

ఆ టైం లో ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ తప్పుకున్నాడని తెలిసి… క్రిష్ తనకు తానుగా బాబు నేను ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చెయ్యనా… అని అడగడంతో రెండే రెండు నిమిషాల్లో ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా క్రిష్ ని ఎంపిక చేశామని చెబుతున్నాడు బాలయ్య. ఇక తేజ చెయ్యనని చెప్పగానే ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్షన్ బాధ్యతలు తానే తీసుకుందామనుకున్నాని.. కానీ క్రిష్ ఆలా అడగడం.. క్రిష్ కి తెలుగు సాహిత్యం బాగా తెలుసునని… బయోగ్రఫీలు ఎన్నో చదివిన అనుభవం ఉండబట్టి ఎన్టీఆర్ బయోపిక్ కి న్యాయం చెయ్యగలడనిపించి క్రిష్ కి దర్శకత్వ బాధ్యతలు అపపగించమని చెప్పాడు.

Tags:    

Similar News