తేజ తిట్టింది ఆ స్టార్ హీరోనే…!!

దర్శకుడిగా తేజ చాలా కొత్త కొత్త సినిమాలతో యూత్ కి దగ్గరయ్యాడు. కానీ తర్వాత అర్ధం పర్థం లేని సినిమాలు చేసి ఫామ్ మొత్తం కోల్పోయాడు. కానీ [more]

Update: 2019-05-29 04:06 GMT

దర్శకుడిగా తేజ చాలా కొత్త కొత్త సినిమాలతో యూత్ కి దగ్గరయ్యాడు. కానీ తర్వాత అర్ధం పర్థం లేని సినిమాలు చేసి ఫామ్ మొత్తం కోల్పోయాడు. కానీ రానా తో చేసిన నేనే రాజు నేనే మంత్రి పొలిటికల్ థ్రిల్లర్ తో మల్లీ ఫామ్ లోకొచ్చాడు. కానీ ఫామ్ లోకొచ్చినట్టే వచ్చి సీత సినిమాతో మళ్ళీ ఫాం కోల్పోయాడు. ఇకతేజ తన హీరోలను చాలా డిఫ్రెంట్ గా సినిమాల్లో చూపిస్తాడు. కేవలం హీరోలని కాదు హీరోయిన్స్ ని సైతం తేజ తన సినిమాలో బలమైన కేరెక్టర్స్ లోనే చూపిస్తాడు. తేజ మనస్తత్వం బట్టి తేజ చెప్పింది ఎలాంటి హీరో అయినా చెయ్యాల్సిందే. తనకు కావాల్సిన టాలెంట్ ని తేజ హీరోల దగ్గర్నుండి పిండుకుంటాడు. చాలామంది హీరోలకు తేజ మంచోడైతే.. మరికొంతమంది హీరోలకు తేజ చెడ్డోడు.

మహేష్ ను ఉద్దేశించే…..

అయితే తాజాగా తేజ ఒక ఇంటర్వ్యూ లో మట్లాడుతూ.. హీరోల్లో తాను మూడు లక్షణాలను పరిశీలిస్తానని చెప్పాడు. నా కథలో హీరోయిజానికి అవసరమైన స్ట్రక్చర్ ఆ వ్యక్తికి ఉందా… లేదా…. అనేది చూస్తాను. నేను ఇచ్చే పాత్రలో ఆ హీరో నటించగలడా…లేదా… అని చూస్తాను. నేను చెప్పినట్టు హీరో చేస్తాడా.. లేదా… అని ఆలోచిస్తాను. కానీ కొంతమంది హీరోలు తమ బ్యాక్ గ్రౌండ్ చూసుకుని దర్శకులు చెప్పింది చేయకుండా… తమకి నచ్చింది చేస్తారు. అలాంటి వాళ్లలో తాను చేసిన నిజం సినిమాలో హీరో చేసాడని చెబుతున్నాడు. మరి నిజం సినిమాలో మహేష్ హీరో అనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు నిజం సినిమాలో హీరోగా తేజ చెప్పింది చెయ్యకుండా.. తను అనుకున్నదే చేస్తాడని… కానీ ఇండస్ట్రీలో వున్న వాళ్లంతా ఆయన గొప్ప నటుడు అంటారు అంటూ మహేష్ పేరుని ఉచ్చరించకుండా ఎద్దేవా చేశాడు. ఆయన నిజం సినిమాలో ఒక సీన్ చేసేటప్పుడు 14 టేకులు తీసుకున్నాడు. అందుకే నేను చెయ్యనని చెప్పేసాను. అందుకే హీరో నేను చెప్పింది చేస్తాడా.. లేదా. అనేది అలోచించి నా సినిమాకి హీరోగా ఎంపిక చేసుకుంటా అని ప్రస్తుత స్టార్ హీరో అయిన మహేష్ ని ఓ ఆటాడుకున్నాడు.

Tags:    

Similar News