కమల్ హాసన్ గొప్ప నటుడు కాదు

డైరెక్టర్ తేజ మరోసారి హీరోస్ పై విరుచుకుపడ్డాడు. ఉన్నదీ ఉన్నట్టు, ముక్కు సూటిగా మాట్లేడే తేజ లేటెస్ట్ గా కమల్ హాసన్ , రజిని మధ్య తేడా [more]

Update: 2019-10-16 08:57 GMT

డైరెక్టర్ తేజ మరోసారి హీరోస్ పై విరుచుకుపడ్డాడు. ఉన్నదీ ఉన్నట్టు, ముక్కు సూటిగా మాట్లేడే తేజ లేటెస్ట్ గా కమల్ హాసన్ , రజిని మధ్య తేడా ఏంటో చెప్పాడు. తన దృష్టిలో కమల్ హాసన్ మహానటుడు కాదని షాకింగ్ కామెంట్స్ చేసాడు. చాలామంది కమల్ హాసన్ గొప్ప నటుడు అనుకుంటారు. కానీ నా ఉద్దేశ్యం ప్రకారం ఆయన గొప్ప నటుడు కాదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం. ఉదాహరణకు కమల్ హాసన్ దశావతారంలో 10 గెటప్స్ వేశాడు. బాగా చేశాడు అని అంతా అనుకున్నారు కానీ ఆ గెటప్స్ లో కమల్ హాసనే కనిపించాడు ఆయన చేసిన పాత్ర కనిపించలేదు. రజిని రోబో సినిమాలో చూస్తే ఓ సీన్ లో సైంటిస్ట్ రజనీని చంపాలని రోబో ప్రయత్నిస్తుంటుంది. రోబోలా మారువేషం వేసుకున్న సైంటిస్ట్ ను గుర్తుపట్టేస్తుంది. అక్కడ మనం రజినిని చూడం ఆ పాత్రను చూస్తాం. అది నటుడి గొప్పదనం. నటుడు కనిపించకూడదు తాను చేసే పాత్ర కనిపించాలి. అందుకే రజని అంటే చాలా ఇష్టం” అని అన్నారు.

కష్టేఫలి…..

స్టార్స్ ఊరికే అయిపోరు. చాల కష్టపడితే తప్ప స్టార్స్ అవ్వలేరు. కానీ ఇప్పుడు చాలామంది ఫ్లూక్ గా స్టార్స్ అయిపోతున్నారు. కాకపోతే వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగేలేరు. నా దృష్టిలో హీరో అనేవాడు కారవాన్ లో ఉండకూడదు. తన పోర్షన్ లేకపోయినా అక్కడే కూర్చుని మిగిలిన నటీనటులు ఏం చేస్తున్నారో చూడాలి. ఇలా ఇతర నటుల యాక్టింగ్ ను కూడా గమనిస్తూ సెట్స్ లో ఉండేవాడే నిజమైన స్టార్ అవుతాడని అమీర్, అమితాబ్, చిరంజీవి లాంటి నటులు అదే చేస్తున్నారు అని అందుకే వారు స్టార్స్ అయ్యారు అని చెప్పుకొచ్చాడు.

 

 

Tags:    

Similar News