బన్నీ తో అవకాశం అంటాడు కానీ.. రాదు!!

దర్శకుడు మారుతీ ప్రేమ కథా చిత్రం అప్పటినుండి స్టార్ హీరో అల్లు అర్జున్ తో సినిమా చేస్తా అంటాడు కానీ.. అది వర్కౌట్ అవ్వడం లేదు. మాములుగా [more]

Update: 2020-04-27 06:39 GMT

దర్శకుడు మారుతీ ప్రేమ కథా చిత్రం అప్పటినుండి స్టార్ హీరో అల్లు అర్జున్ తో సినిమా చేస్తా అంటాడు కానీ.. అది వర్కౌట్ అవ్వడం లేదు. మాములుగా బన్నీ – మారుతి ఫ్రెండ్స్. అందుకే అల్లు అర్జున్ తో గీత ఆర్ట్స్ లో ఏదైనా మంచి కథతో సినిమా చెయ్యాలి అనుకుంటాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం మారుతికి అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే మారుతీ ఇప్పటివరకు స్టార్ రేంజ్ చేరుకోలేదు. యంగ్ హీరోలతో తప్ప మారుతీ ఇంతవరకు ఓ స్టార్ హీరోను పట్టలేకపోయాడు. ఓ స్టార్ కథను తేలేకపోయాడు. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఫ్రీ అయిన మారుతీ – అల్లు అర్జున్ లు వాట్స్ఆప్ లో మాట్లాడుకుంటారట.

ఈ విషయాన్నీ మారుతీ స్వయంగా చెబుతున్నాడు. బన్నీ తాను రోజు వాట్స్ఆప్ లో చాట్ చేసుకుంటామని… అల్లు అర్జున్ తనకి జోక్స్ పంపుతుంటే.. తాను కూడా ఫన్నీ గా ఉండే జోక్స్ ని బన్నీకి పంపుతుంటా అని.. తామెప్పుడూ వాట్స్ ఆప్ లో టచ్ లోనే ఉంటామని చెబుతున్నాడు. మంచి కథ దొరికే త్వరలోనే బన్నీతో సినిమా అంటూ మరోసారి మారుతీ చెప్పాడు. మరి మారుతీ చెప్పడమే కానీ.. అల్లు అర్జున్ ఎక్కడా మారుతితో సినిమా అని చెప్పాడు. కానీ మారుతీ మాత్రం అల్లు అర్జున్ తో సినిమా చేస్తా అంటూనే ఉంటాడు. అసలు అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ కి పెరిగిపోయాడు. ఇక మారుతికి అల్లు అర్జున్ ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు..

Tags:    

Similar News