ఎన్టీఆర్ పాత్రకి.. ఎన్టీఆర్ డబ్బింగేనా?

Update: 2018-11-14 03:31 GMT

క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1, 2 ని అంటే కథానాయకుడు, మహానాయకుడు సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. బాలకృష్ణ కూడా క్రిష్ కి ఎలా కావాలో అలానే సహకరిస్తూ.. ఒక యజ్ఞం లా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్శ్ ని పూర్తి చేసుకుపోతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మొదలై నాలుగు నెలలే అయ్యింది అప్పుడే కథానాయకుడు షూటింగ్ చివరికొచ్చేసింది. ఇక మహానాయకుడు షూటింగ్ కూడా డిసెంబర్ చివరినాటికి కంప్లీట్ చేసేస్తారని చెబుతున్నారు. మరి షూటింగ్ చివరి దశలో ఉండగానే క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టేస్తాడట. అందులో భాగంగానే బాలకృష్ణ అదే ఎన్టీఆర్ పాత్రధారి డబ్బింగ్ కూడా స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.

మరి కథానాయకుడు లో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య వివిధ గెటప్స్ వేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నట జీవితంలో బిగ్గెస్ట్ హిట్స్ అయినా సినిమాల్లోని కీలకమైన కేరెక్టర్స్ ని బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కోసం వేసాడు. అయితే ఎన్టీఆర్ పాత్రల్లో బాలయ్య జీవించడానికి ఎంతగా కష్టపడ్డాడో.. ఆయా పాత్రల మేకప్స్ చూస్తే మనకే తెలుస్తుంది. ఇక ఆ పాత్రల్లో బాలయ్య ఎంతగా కష్టపడ్డాడో కానీ.... డబ్బింగ్ విషయంలో మాత్రం అంతగా కష్టపడక్కర్లేదంటున్నారు. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాల్లో ఎప్పటికి మరిచిపోని కొన్ని స‌న్నివేశాల్ని చూపిస్తారట. ఉదాహ‌ర‌ణ‌కు బొబ్బిలిపులిలోని కోర్టు సీను, దాన‌వీర శూర‌క‌ర్ణ‌లోని ఏమంటివి ఏమంటివి.... లాంటి సన్నివేశాలన్న‌మాట‌.

మరి ఎన్టీఆర్ గంభీరమైన గొంతుతో చెప్పిన ఆ డైలాగ్ ఇప్పటికి ఎప్పటికి ఫెమస్. అయితే బాలకృష్ణ తన గొంతుతో అంతగా ఆ డైలాగ్స్ ని పండించలేడు కాబట్టే.... ఆయా కీలక స‌న్నివేశాల‌కు ఎన్టీఆర్ పాత గొంతునే వినిపిస్తార‌ని స‌మాచారం. బాలయ్య గొంతుకన్నా .. ఎన్టీఆర్ గొంతు అయితేనే ఆ సన్నివేశాలకు కరెక్ట్ అని క్రిష్ భావిస్తున్నాడట. మరి సినిమా మొత్తం బాలయ్యే మాట్లాడిన... కొన్ని కీలక సన్నివేశాల్లో ఎన్టీఆర్ గొంతునే యధావిధిగా ఉంచబోతున్నారన్నమాట. ఆ లెక్కన బాలయ్యకి డబ్బింగ్ శ్రమ తగ్గినట్టేగా. ఇక కథానాయకుడు జనవరి 9 న మహానాయకుడు జనవరి 24 న అంటున్నారు కానీ.. మహానాయకుడు ఫిబ్రవరి 14 కి వెళుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

Similar News