పెద్ద దర్శకుడైతే.. వదిలెయ్యాలా?

Update: 2018-05-22 06:51 GMT

టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేసినా స్టార్ డైరెక్టర్ కాలేకపోయినా బాబీ ఇప్పుడు తానొక పెద్ద డైరెక్టర్ ని అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్ బాబి గత రాత్రి అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ అనే వ్యక్తి కారుని తన కారుతో డాష్ ఇచ్చాడు. అమీర్‌పేటకు చెందిన హర్మిందర్ సింగ్ తన కుటుంబంతో కలిసి మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ లో జరిగిన ఒక ఫంక్షన్ కి హాజరై రాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నంబరు-33 వద్దకు రాగానే, దర్శకుడు బాబీ కారు వెనక నుంచి వచ్చి హర్మిందర్ కారును బలంగా ఢీకొట్టింది.

నేను పెద్ద డైరెక్టర్ ను...

అయితే ఈ యాక్సిడెంట్ లో హర్మిందర్ సింగ్ కుటుంబసభ్యులకు దెబ్బలు తగలకపోయినా, హర్మిందర్ సింగ్ కారు వెనుక భాగం మాత్రం డ్యామేజ్ అయింది. అయితే హర్మిందర్ సింగ్ వెంటనే కారు దిగి బాబీ ని అడ్డగించగా కారులో ఉన్న బాబీ తో పాటుగా మరో ఇద్దరు కారుని ఢీ కొట్టినందుకు తప్పు ఒప్పుకోగా పోగా, హర్మిందర్ సింగ్ ని బెదిరించే ప్రయత్నం చెశారట. అలాగే తానొక పెద్ద డైరెక్టర్ ని అని తమ ఇల్లు పక్కనే ఉందని మాట్లాడుకుందామని పిలువగా హర్మిందర్ సింగ్ సరే అన్నాడట .

ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయాడు...

అయితే ఈలోపు అక్కడే ఉన్న హర్మిందర్ సింగ్ తల్లికి గుండెపోటు రావడంతో అతను తన తల్లికి సేవలు చేస్తుండగా తమకి ఇండస్ట్రీలోని పలువురు తెలుసనీ, బాబీ ఫోన్ లో పవర్ సర్ అంటూ మాట్లాడుతూ అక్కడనుండి మెల్లగా వెళ్లిపోయాడంట. అందుకే తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ బాబీ పై కంప్లైంట్ చేశానని సోషల్ మీడియా లో హర్మిందర్ సింగ్ ట్వీట్ చేసాడు. ఎంత పెద్ద డైరెక్టర్ అయితే మాత్రం యాక్సిడెంట్ చేసి తప్పించుకుందామనుకున్నాడో ఏమో బాబీ.

Similar News