హిట్ చిత్రాల దర్శకుడు ఇక లేరు..!

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను సినీ పరిశ్రమకు అందించిన దర్శకుడు విజయ బాపినీడు ఈ రోజు ఉదయం క‌న్నుమూశారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక హిట్ చిత్రాలను అందించారాయ‌న‌. [more]

Update: 2019-02-12 07:03 GMT

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను సినీ పరిశ్రమకు అందించిన దర్శకుడు విజయ బాపినీడు ఈ రోజు ఉదయం క‌న్నుమూశారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక హిట్ చిత్రాలను అందించారాయ‌న‌. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ బాపినీడు హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. బిగ్ బాస్, మహానగరంలో మాయగాడు, ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్, మగ ధీరుడు వంటి హిట్ చిత్రాలకు ఆయ‌న దర్శకత్వం వహించారు. 86 ఏళ్ల‌ విజయ బాపినీడు సెప్టెంబర్ 22, 1936న‌ ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. ఆయన అసలు పేరు గుట్ట బాపినీడు చౌదరి. కెరీర్ తొలినాళ్లలో పత్రిక సంపాదకుడిగా పనిచేశారు. ఇక రచయితగా, దర్శకుడిగానే కాదు విజయ బాపినీడు నిర్మాతగా కూడా సుపరిచితుడే. విజయ బాపినీడు మరణ వార్త విన్న పరిశ్రమలోని చిన్నాపెద్ద అందరూ ఆయనకి నివాళులర్పించడానికి, తుది వీడ్కోలు పలకడానికి ఆయన స్వగృహానికి తరలి వెళుతున్నారు.

Tags:    

Similar News