దిల్ రాజు సెంటిమెంట్ ఫాలో అయినట్టే!!

దిల్ రాజు ఖచ్చితంగా సంక్రాంతికి సినిమా విడుదల చెయ్యడం హిట్ కొట్టడం అనేది చాలాసార్లు చూసాం. ఎక్కువగా దిల్ రాజుకి సంక్రాతి సెంటిమెంట్ ఉంటుంది. పెద్ద సినిమాలున్నా [more]

Update: 2020-11-03 06:04 GMT

దిల్ రాజు ఖచ్చితంగా సంక్రాంతికి సినిమా విడుదల చెయ్యడం హిట్ కొట్టడం అనేది చాలాసార్లు చూసాం. ఎక్కువగా దిల్ రాజుకి సంక్రాతి సెంటిమెంట్ ఉంటుంది. పెద్ద సినిమాలున్నా దిల్ రాజు ఏ మాత్రం లెక్క చెయ్యడు. అయితే చాలా సినిమాలు కరోనా కి భయపడి ప్రస్తుతం విడుదల చెయ్యాల్సిన సినిమాలన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటుంటే దిల్ రాజు మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉండడంతో అందరిలో అనుమానాలు. దిల్ రాజు సెంటిమెంట్ వదిలేశాడా? అని. అదే పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా సెట్స్ మీదకి రాలేదు.. మనం సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేస్తే ఇరుక్కుంటామేమో అనే ధ్యాసలో దిల్ రాజు కామ్ అయ్యాడు.

కానీ వకీల్ సాబ్ షూట్ కోసం పవన్ నిన్ననే సెట్స్ మీదకి ఎంటర్ అయ్యాడు. అంటే మరో 20 రోజుల్లో వకీల్ సాబ్ షూట్ మొత్తం ఫినిష్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కి మరో నెల రోజులు. అంటే సంక్రాంతికి పక్కాగా వకీల్ సాబ్ రెడీ. మరి దిల్ రాజు ఇంకెందుకు ఆగుతాడు వకీల్ సాబ్ ని తన సెంటిమెంట్ ప్రకారం సంక్రాంతికే విడుదల చేస్తాడు. ఎంతమంది ఎన్ని సినిమాలు వదిలినా వకీల్ సాబ్ హిట్ అవడం పక్కా. అందులో తనకి సెంటిమెంట్ ఉండనే ఉంది. అందుకే దిల్ రాజు ఇక ఆలస్యం చెయ్యకుండా వకీల్ సాబ్ డేట్ ని ప్రకటించడానికి రెడీ అవడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News