గీత గోవిందంను చూసి భయపడుతున్న దిల్ రాజు..?

Update: 2018-07-24 07:11 GMT

విజయ్ దేవరకొండ తాజా చిత్రం గీత గోవిందం గీత ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కాబోతుంది. గీత గోవిందం సినిమా మీద అంచనాలు ఇప్పుడు తారస్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ సోమవారం విడుదలైన గీత గోవిందం టీజర్ ఆ రేంజ్ లో అందరినీ పడేసింది. ఎంతో డీసెంట్ గా ఉన్న గీత గోవిందం టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోయాయి. ఇప్పటికే గీత గోవిందం సింగిల్స్, పోస్టర్స్ తో తెగ హడావిడి చేస్తున్న చిత్ర బృందం ఇప్పుడు గీత టీజర్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. క్యూట్ అండ్ స్మార్ట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ సూపర్బ్ గా కనిపిస్తున్నాడు. మరి టీజర్ ని చాలా జాగ్రత్తగా అందరి మనసులని తాకేలా కట్ చేసి అందులో సక్సెస్ అయ్యారు కూడా.

వారం ముందే రానున్న శ్రీనివాస కళ్యాణం...

అయితే ఇప్పుడు ఈ సినిమాకొస్తున్న క్రేజ్ చూసి టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరు కాస్త టెన్షన్ పడుతున్నారట. ఆయన నిర్మించిన సినిమా కూడా గీత గోవిందం సినిమా కన్నా ముందు వారమే విడుదలవుతుంది. మరి ఆ సినిమాకి ట్రేడ్ లో, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు... నితిన్ - రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాస కళ్యాణం టీజర్ కాదు.. ఆ సినిమా పబ్లిసిటీ కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ కూడా చాలా అందంగా ఆకట్టుకునేలా ఉంది. రాశి క్యూట్ లుక్స్, నితిన్ క్లాసీ లుక్స్ అందులోని ఫ్యామిలీ డైలాగ్స్ అన్ని బావున్నాయి. మరి ఆ సినిమాపై అంత అంచనాలుంటే దాని నిర్మాత దిల్ రాజు భయపడడం ఏమిటా అనుకుంటున్నారా.

కలెక్షన్లు చీలిపోతాయని భయం

శ్రీనివాస కళ్యాణం విడుదలైన ఆరో రోజే గీత గోవిందం విడుదలవుతుంది. మరి శ్రీనివాస కళ్యాణం సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే.... ఆ సినిమా మరో 15 రోజులు ఆడితే బోలెడన్ని లాభాలొస్తాయి. కానీ గీత గోవిందం లోని ప్రేమ కథ, విజయ్ దేవరకొండ కున్న భారీ క్రేజ్ అన్నీ సినిమాకి హైప్ పెంచేలా ఉన్నాయి. మరి శ్రీనివాస కళ్యాణం హిట్ అయినప్పటికీ... గీత గోవిందం సినిమా వచ్చేస్తుంది కాబట్టి కలెక్షన్స్ మొత్తం చీలిపోతాయి. అందుకే గీత గోవిందం మీద కన్నా తన సినిమా మీదే ఎక్కువ క్రేజ్ రావాలని దిల్ రాజు తన సినిమా ప్రమోషన్స్ ని వెరైటీగా చేస్తున్నాడు. మరి అర్జున్ రెడ్డి క్రేజ్ భారీగా ఉన్న విజయ్ ముందు దిల్ రాజు ఐడియాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Similar News