హీరోలందరి దారిలో విజయ్ కూడా..

చాలామంది హీరోలు తమకి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకులకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా సందర్భాల్లో చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. అందులో [more]

Update: 2019-02-03 04:38 GMT

చాలామంది హీరోలు తమకి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకులకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా సందర్భాల్లో చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. అందులో టాలీవుడ్ లో ఎన్టీఆర్ అప్పట్లో పూరి కి ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే జనతా గ్యారేజ్ హిట్ ఇచ్చిన కొరటాలకు ఒక విల్లా గిఫ్ట్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. ఇక భరత్ అనే నేను తర్వాత మహేష్, కొరటాల టీం కి ఐ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చాడు. తాజాగా ఎఫ్ 2 తో హిట్ కొట్టిన దిల్ రాజు కూడా తన ఆఫీస్ టీం కి భారీ గిఫ్ట్ లే ఇచ్చాడు. తమిళంలోనూ హీరో సూర్య ఇలా సినిమాలు హిట్ అయితే డైరెక్టర్స్ కి గిఫ్ట్ లు అవి ఇస్తుంటాడని అంటుంటారు.

తాజాగా మరో హీరో కూడా ఈ హీరోలని ఫాలో అవుతున్నాడు. అదేనండి 96 తో బంపర్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి. విజయ్ కి స్టార్ హీరో అన్నంత ఫాలోయింగ్ లేకపోయినా.. ఈమధ్యన వరస హిట్స్ తో మార్కెట్ పెంచుకున్న హీరో విజయ్ సేతుపతి. గత ఏడాది త్రిష తో కలిసి ప్రేమ్ కుమార్‌ డైరెక్షన్ లో 96 మూవీ లో నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ క్లాసిక్ హిట్ అయింది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు తమిళులంతా బ్రహ్మరధం పట్టారు. ఆ సినిమా తో విజయ్ సేతుపతి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

ఇక అదే సినిమాని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగులో శర్వానంద్, సమంత లతో రిమేక్ కూడా చెయ్యబోతున్నాడు. మరి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన 96 దర్శకుడు ప్రేమ్ కుమార్‌ కి విజయ్ సేతుపతి కూడా ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ ప్రెసెంట్ చేసాడట. విజయ్ సేతుపతి ఏంటో ప్రేమగా ప్రేమ్ కుమార్ కి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను రిజిస్ట్రేషన్ చేయించి మరీ కానుకగా ఇచ్చాడట. మరి విజయ్ ఇచ్చిన గిఫ్ట్ తో ప్రేమ్ కుమార్ ఫుల్ హ్యాపీ. ఇకపోతే తెలుగులో 96 రీమేక్ దర్శకుడిగా కూడా ఈ ప్రేమ్ కుమారే చెయ్యబోతున్నాడు. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన 96 ఇక్కడ తెలుగులోనూ భారీ హిట్ అవుతుందని నిర్మాత దిల్ రాజు బలంగా నమ్ముతున్నాడు.

Tags:    

Similar News