ఇంకేం పట్టించుకుంటాడు

దిల్ రాజు ప్లాప్ హీరోలకు లైఫ్ ఇస్తాడంటూ.. చాలామంది యంగ్ హీరోలు దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతారు. అయితే దిల్ రాజు కూడా [more]

Update: 2019-12-29 15:11 GMT

దిల్ రాజు ప్లాప్ హీరోలకు లైఫ్ ఇస్తాడంటూ.. చాలామంది యంగ్ హీరోలు దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతారు. అయితే దిల్ రాజు కూడా మంచి కథలను నమ్మి వారితో సినిమాలు చేస్తాడు. కానీ ఒక్కోసారి దిల్ రాజు అభిరుచులను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు. గత ఏడాది నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ అయితే ఈ ఏడాది ప్లాప్స్ హీరో రాజ్ తరుణ్ తో చేసిన ఇద్దరి లోకం ఒక్కటే ప్లాప్. అసలు ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని రాజుగారు… ప్రమోషన్స్ కూడా సో సో గా చేసాడు.

ఇక సినిమా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుందని మీడియా కి ముఖమే చాటేశాడు. పోయిన సినిమాకి ప్రమోషన్స్ ఎందుకులే అనుకున్నాడేమో… ఇక ఎంత ప్లాప్ సినిమా అయినా విడుదలైన సాయంత్రమే సక్సెస్ మీట్ పెడుతున్న ఈరోజుల్లో ఇద్దరి లోకం ఒకటే విడుదలై నాలుగు రోజులైనా ఆ సినిమా గురించి దిల్ రాజు కాదు గదా రాజ్ తరుణ్ కూడా పట్టించుకోవడం లేదు. ఎలాగూ పారితోషకం కూడా లేదు.. ఇంకా ప్రమోషన్ ఎవడు చేస్తాడని రాజ్ తరుణ్ కూడా అనుకున్నాడేమో.. అందుకే ఈ సినిమాని లైట్ తీసుసుకున్నాడు. మరి కథలో బలం లేని సినిమాకి ప్రమోషన్స్ చేసినా వెస్ట్ అన్నట్టుగా దిల్ రాజు, రాజ్ తరుణ్ ల వ్యవహారముంది అలాంటప్పుడు ఈ సినిమాని ఎలా.. ఎందుకు.. తీశారో అనేది వాళ్ళకే తెలియాలి

Tags:    

Similar News