దిల్ రాజు ప్లాన్ మరోసారి వర్కవుట్ అవ్వనుందా..?

Update: 2018-12-15 06:55 GMT

ఈ సంక్రాంతికి తెలుగు నుండి మూడు సినిమాలు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా జనవరి 10న వస్తుందని ప్రకటించగా టీం ఆ మేరకు షూటింగ్ ను చకచకా కంప్లీట్ చేసే పనిలో ఉంది. ఒక పక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. వారం వారంకి ఏదో ఒక పోస్టర్ వదులుతూ... ఇందులో వివిధ పాత్రలకు ఎంపికైన నటీనటుల వివరాలు వెల్లడిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. సంక్రాంతి మరో సినిమా రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కొంచెం లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ బాగానే బజ్ తెచ్చుకుంది. ఇక మూడో సినిమా ‘ఎఫ్-2’. ఈ రెండిటితో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం వెనక పడిందనే చెప్పాలి. ఆ మధ్య ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కానీ... అదేదో షాపింగ్ మాల్ యాడ్ కోసం ఇచ్చిన యాడ్ లాగా కనిపించింది. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది.

ఆకట్టుకుంటున్న ఎఫ్2 టీజర్

ఈ టీజర్ తో ఈ సంక్రాంతి రేస్ లో హిట్ కొట్టేది ‘ఎఫ్-2’ అన్నట్టుగా టీజర్ ఉంది. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీని డీల్ చేయడంలో దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు. వెంకీ..వరుణ్ ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. కాన్సెప్ట్ పరంగా కొత్తేమీ కాదు.. కానీ తెలిసిన కథల్నే వినోదాత్మకంగా చెప్పడంలో అనిల్ మరోసారి తన ముద్ర చూపించినట్లున్నాడు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం అన్న రీతిలో ఈ సినిమా ఉండబోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పైగా ఈ సినిమాకు కలిసొచ్చే అంశం ఏంటంటే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవ్వడం. ఎందుకంటే సంక్రాంతి సీజన్ యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఊహించని స్థాయిలో విజయం సాధించాయి. ఉదాహరణకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శతమానం భవతి’. అందుకే దిల్ రాజు ఈ సినిమాను పట్టు బట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడానికి కూడా ఇదే కారణం. సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చూడటానికే ఎక్కువ ఇష్టపడతారు. కామెడీ బాగుంటే ఒకటికి రెండుసార్లు చూసే అవకాశం ఉంది.

Similar News